
సాక్షి,చెన్నై: అయిదు రోజుల పాటు నిర్విరామంగా యోగా చేస్తూ నగరానికి చెందిన కవితా భరణీదరన్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును తిరగరాసింది. యోగా మారథాన్‌తో ప్రద్య్నా పాటిల్ నెలకొల్పిన గత రికార్డును తుడిచిపెట్టిన కవిత వారం రోజుల పాటు యోగా విన్యాసాలను కొనసాగించాలని భావిస్తోంది.
ఈనెల 23న ఉదయం 7 గంటలకు ప్రారంభించిన యోగాను డిసెంబర్ 30 వరకూ కొనసాగించి సుదీర్ఘ యోగ మారథాన్‌తో సరికొత్త గిన్నీస్ రికార్డు సాధించాలని యోచిస్తోంది. మొక్కవోని విశ్వాసంతో ఆమె ముందుకు సాగుతున్న తీరు అభినందనీయమని కవితకు యోగ సాధన మెళకువలు నేర్పించిన గురువు పేర్కొన్నారు.