
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో అన్ని రకాలైన అడ్వర్టయిమెంట్లకు సంబంధించి కొత్త విధానం అమలులోకి వచ్చింది. నగరంలో ఏర్పాటు చేసే హోర్డింగ్స్‌పై గరిష్ట ఎత్తును జీహెచ్‌ఎంసీ నిర్ధేశించింది. హోర్డింగ్స్ 15 అడుగుల ఎత్తును మించి ఉండరాదన్న నిబంధన విధించింది. వాహనాలపై ఏర్పాటు చేసే ప్రకటనలకు కచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ స్పష్టంగా పేర్కొంది. అలాగే, నాలలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రకటనలను పూర్తిగా నిషేధించింది. అడ్వర్టయిజ్‌మెంట్స్‌కు సంబంధించి హోర్డింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు కచ్చితంగా రోడ్డు, ప్రజాభద్రత విధివిధానాలను పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ శనివారం హెచ్చరించింది.
(‘ఒకరి బాధకు కారణమవ్వకండి’)
Comments
Please login to add a commentAdd a comment