
సాక్షి, హైదరాబాద్: నగరంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అనుచరులు బరితెగించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 66లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అక్రమ నిర్మాణానికి పాల్పడ్డాడు. అక్రమంగా నిర్మించిన ఇంటిని జీహెచ్‌ఎంసీ సిబ్బంది కూల్చే ప్రయత్నం చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ సిబ్బందిని సీఎం రమేష్ అనుచరులు అడ్డుకున్నారు. ఈ ఘటన జరుగుతుండగానే సీఎం రమేష్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, ఇప్పటికే కొంత భాగాన్ని కూల్చిన జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు సాయంతో మిగిలిన అక్రమ నిర్మాణాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
చదవండి: (Revenue Deficit: రూ.9,871 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్రం)
Comments
Please login to add a commentAdd a comment