సెర్చ్ జెయింట్ గూగుల్ మరోసారి ఉద్యోగాల కోతను ప్రకటించింది. మ్యాపింగ్ సర్వీస్ వేజ్‌లో ఉద్యోగులను తొలగించేందుకు యోచిస్తోంది. ఆదాయం క్షీణిస్తున్న నేపథ్యంలో సామర్థ్యం తగ్గించుకునేందుకు యోచిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. అలాగే వేజ్‌ను అడ్వర్టైజింగ్ సాఫ్ట్‌వేర్‌ను గూగుల్ యాడ్స్ టెక్నాలజీ కోసం వినియోగించనున్నట్లు తెలిపింది. అయితే తాజా నిర్ణయంలో ఎంత మందిని తొలగిస్తుందనేది స్పష్టత లేదు. పూర్తి స్పష్టత రావాలంటే గూగుల్ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.
రాయిటల్స్ నివేదిక ప్రకారం ఎక్కువగా సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, అనలిటిక్స్ విభాగాల ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. వేజ్‌ను గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO)కి మార్చడంతోపాటు గూగుల్ మ్యాప్స్‌తో కలపాలని కంపెనీ యోచిస్తోంది. ప్రకటనదారులకు మరింత మెరుగైన దీర్ఘకాలిక అనుభవాన్ని అందించాలనే లక్ష్యంలో భాగంగా వేజ్ ప్రస్తుత అడ్వర్టైజింగ్ సిస్టంను గూగుల్ యాడ్స్ టెక్నాలజీకి మార్చనుంది. ఫలితంగా వేజ్ ప్రకటనల మానిటైజేషన్‌కు సంబంధించిన ఉద్యోగాల్లో తొలగింపులుంటాయని గూగుల్ జియో యూనిట్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ ఫిలిప్స్ ఉద్యోగులకు తెలిపారు.
కాగా గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్, స్ట్రీట్ వ్యూ లాంటి సేవలందింస్తే గూగుల్ జియో డివిజన్‌లో వేజ్‌ను విలీనం చేయబోతున్నట్టు గత ఏడాది చివర్లోనే గూగుల్ ప్రకటించింది. అలాగే ఆదాయానికి కీలకమైన డిజిటల్ అడ్వర్టైజింగ్‌కు గత సంవత్సరం డిమాండ్ మందగించిన నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే పనిలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఉద్యోగాలను తగ్గించుకుంటోంది. ఇందులో భాగంగానే జనవరిలో గ్లోబల్‌గా ఉద్యోగులను 6శాతానికి మించి దాదాపు 12వేల ఉద్యోగులను తీసివేసింది. కాగా ఏప్రిల్‌లో కంపెనీ మొదటి త్రైమాసిక ఫలితాల్లో యూట్యూబ్ ద్వారా ఊహించిన దానికంటే బలమైన ప్రకటనల అమ్మకాలపై అంచనాల కంటే ఎక్కువగా ఉన్నట్లు నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment