గత ప్రభుత్వ హయంలోనే ప్రకటనలు: ఆర్టీసీ ఈడీ | APSRTC ED Koteswara Rao Press Meet About Tirupathi Depot Ticket Dispute | Sakshi
Sakshi News home page

గత ప్రభుత్వ హయంలోనే ప్రకటనలు: ఆర్టీసీ ఈడీ

Published Fri, Aug 23 2019 8:44 PM | Last Updated on Fri, Aug 23 2019 8:44 PM

APSRTC ED Koteswara Rao Press Meet About Tirupathi Depot Ticket Dispute - Sakshi

సాక్షి, విజయవాడ : తిరుపతి ఆర్టీసీ బస్‌ టిక్కెట్ల వెనుక అన్యమతాలకు చెందిన ప్రకటనలు ఉండడం పట్ల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఈడీ కోటేశ్వర్‌ రావు శుక్రవారం వివరణనిచ్చారు. ఆ ప్రకటనలు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినవని ఆయన వెల్లడించారు. గత మార్చిలో మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 18 ప్రకటనలను రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో టిక్కెట్ల వెనుక ముద్రించారని, అందులో కొన్ని రోల్స్‌ తిరుపతి డిపోకు వచ్చాయని తెలిపారు. గత మూడేళ్లుగా ఆర్టీసీలో ప్రకటనల బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకిచ్చారని తెలిపారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషిద్ధం కనుక మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement