![Youtube Implemented Up To 5 Advertisements From September 2022 - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/13/Untitled-1.psd_.jpg.webp?itok=iXPgg6Bm)
ప్రముఖ వీడియో షేరింగ్ దిగ్గజం యూజర్లకు యూట్యూబ్ భారీ షాక్ ఇచ్చింది. యూజర్ల సహనానికి పరీక్ష పెడుతూ సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచి సైలెంట్‌గా కొత్త యాడ్ ఫార్మాట్‌ను ప్రారంభించింది. ఈ కొత్త యాడ్ ఫార్మాట్ ప్రకారం.. యూట్యూబ్ ప్రీమియం తీసుకోని యూట్యూబ్ ఫ్రీ వెర్షన్ యూజర్లకు అదనంగా యాడ్స్ జోడించింది.
యూట్యూబ్ ఫ్రీ వెర్షన్ వాడే వారికి వీడియో ఆరంభంలో 2యాడ్స్ మాత్రమే కనిపించేవి. కానీ ఇకపై యూజర్ల సహనానికి మరింత పరీక్ష పెట్టేలా 5యాడ్స్‌ను తీసుకొని రానుంది. ఇప్పటికే ఈ కొత్త యాడ్ మోడల్ ఎంపిక చేసిన యూజర్లకు ప్లే అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఓ యూజర్ తాను వీడియో చూస్తున్నప్పుడు 5యాడ్స్ ప్లే అవుతున్నాయి. ఆ యాడ్స్ పట్ల అసౌకర్యానికి గురవుతున్నామని, వివరణ ఇవ్వాలని కోరుతూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌పై యూట్యూబ్ యాజమాన్యం స‍్పందించింది. ఇలా 5 యాడ్స్ ప్లే అయితే వాటిని బంపర్ యాడ్స్ అంటారు. ఒక్కోటి 6 సెకన్లు ఉంటుందని వివరణిచ్చింది. ప్రస్తుతం ఈ నిర్ణయంపై యూట్యూబ్ యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment