ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై.. సొంత పార్టీ నేతనే తీవ్ర విమర్శలు గుప్పించాడు. వ్యాక్సినేషన్‌లో విఫలమవుతూనే.. మరోపక్క యాడ్‌ల పేరుతో ప్రజా ధనాన్ని వృథాగా ఖర్చు చేస్తున్నాడంటూ సీఎం కేజ్రీవాల్‌పై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మండిపడ్డాడు. ఈ మేరకు ఓ వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై, ఆప్ కీలక నేత.. డిప్యూటీసీఎం మనీశ్ సిసోడియా మండిపడ్డట్లు 30 సెకండ్ల నిడివి ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓవైపు సిసోడియా మాట్లాడుతుండగా.. మరోవైపు ఆప్ యాడ్‌లతో ఉన్న పేపర్ క్లిప్పులు, యాడ్ కట్టింగ్‌లు కనిపిస్తున్నాయి ఆ వీడియోలో. యాడ్‌ల పేరుతో ఎంత వృథా చేస్తారు. వ్యాక్సిన్‌లు దొరక్క ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. అని అందులో డైలాగులు ఉన్నాయి. దీంతో వీడియో విపరీతంగా షేర్ అయ్యింది. ఆప్‌లో ముసలం మొదలైందని, కీలక నేతల మధ్య వైరం షురూ అయ్యిందని రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే..
Mr. Handsome Sisodia Slams Kejriwal For "No Vaccination, Only Ads". pic.twitter.com/rNMs1fuQro
— अमित शर्मा (@AmitsharmaGRENO) June 24, 2021
ఫ్యాక్ట్ చెక్..
ఆ రెండు వేర్వేరు వీడియోలు. ఎవరో ఎడిట్‌చేసి వైరల్ చేశారు. మనీశ్ సిసోడియా జూన్ 21న నిర్వహించిన ట్విటర్ లైవ్ మీడియా సమావేశంలో ఢిల్లీ వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి మాట్లాడాడు. అదేరోజు ఉదయం ‘‘ ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన ఘనత’ పేరుతో బీజేపీ పాలిత రాష్రా‍్టల్లో ఫుల్ పేజ్ యాడ్‌లు పబ్లిష్ అయ్యాయి. అయితే వాస్తవ పరిస్థితి మరోలా ఉందని, గప్పాలు మానుకోవాలని, ప్రచారానికి ఖర్చు పెట్టే డబ్బును వ్యాక్సిన్‌ల కోసం ఉపయోగించాలని బీజేపీకి సూచిస్తూ సిసోడియా ప్రెస్ మీడియాలో మాట్లాడాడు. అందులోని పోర్షన్‌లను కట్ చేసి.. ఎవరో ఎడిట్ చేశారు. సో.. మనీష్ సిసోడియా విమర్శించింది సొంత ప్రభుత్వాన్ని కాదు.. కేంద్ర ప్రభుత్వాన్ని.
Addressing an important Press Conference | LIVE https://t.co/CCdbez8UeJ
— Manish Sisodia (@msisodia) June 21, 2021
Comments
Please login to add a commentAdd a comment