Delhi deputy cm
-
ఢిల్లీ డిప్యూటీ సీఎం అరెస్ట్‌పై స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇది ప్రధాని మోదీ-అదానీ అనుబంధం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చేసిన పనే తప్ప మరొకటి కాదని కేసీఆర్ పేర్కొన్నారు. ఐదు రోజుల సీబీఐ కస్టడీకి సిసోడియా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం సీబీఐ హాజరుపరిచింది. ఈ కేసులో ఆయనను విచారించేందుకు ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది. తాము అడిగే ప్రశ్నలకు సిసోడియా సరిగ్గా సమాధానాలు ఇవ్వడం లేదని, మొబైల్ ఫోన్లు కూడా మార్చారని కోర్టుకు చెప్పింది. ఈ కేసులో ఆయనదే కీలక పాత్ర అని, అయిదు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోర్టు కోరింది. సీబీఐ అధికారుల విజ్ఞప్తి మేరకు సిసోడియాకు ఐదు రోజుల కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. సిసోడియా అరెస్టును వివిధ రాజకీయ పార్టీలు ఖండించాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నేతలపై దాడులకు ఉపయోగిస్తోందని విమర్శించాయి. సిసోడియా అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. చదవండి: సీబీఐని నాకు అప్పగిస్తే.. వాళ్లను రెండు గంటల్లో అరెస్టు చేయిస్తా: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ -
మనీశ్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ దాడులు..
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ మరోమారు దాడులు చేసింది . లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ సెక్రటేరియట్లో తన కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు చేసినట్లు మనీశ్ సిసోడియా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. आज फिर CBI मेरे दफ़्तर पहुँची है. उनका स्वागत है. इन्होंने मेरे घर पर रेड कराई, दफ़्तर में छापा मारा, लॉकर तलशे, मेरे गाँव तक में छानबीन करा ली.मेरे ख़िलाफ़ न कुछ मिला हैं न मिलेगा क्योंकि मैंने कुछ ग़लत किया ही नहीं है. ईमानदारी से दिल्ली के बच्चों की शिक्षा के लिए काम किया है. — Manish Sisodia (@msisodia) January 14, 2023 ' సీబీఐ అధికారులు ఇవాళ మరోమారు నా కార్యాలయానికి వచ్చారు. వాళ్లకు స్వాగతం పలుకుతున్నా. వాళ్లు నా ఇంట్లో, ఆపీస్లో, బ్యాంకు లాకర్లో ఇదివరకే తనిఖీలు చేశారు. నా సొంత ఊరికి వెళ్లి కూడా విచారణ జరిపారు. కానీ వాళ్లకు ఏమీ దొరకలేదు. భవిష్యత్తులో కూడా ఏమీ దొరకదు. ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు' అని సిసోడియా ట్విట్టర్లో రాసుకొచ్చారు. చదవండి: 900 కిమీ దూరం.. గంటల వ్యవధిలోనే చనిపోయిన కవల సోదరులు.. -
ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైస్ పాలసీ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెంచింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీశ్ సిసోడియాకు సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. సీబీఐ సమన్లు జారీ చేయటంపై స్పందించారు సిసోడియా. గతంలో సీబీఐ దాడులు చేపట్టగా తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. అయితే, దర్యాప్తు సంస్థకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ‘నా ఇంటిలో సీబీఐ 14 గంటల పాటు సోదాలు నిర్వహించింది. కానీ, ఏమీ లభించలేదు. వారు నా బ్యాంకు లాకర్‌ను సైతం తనిఖీ చేశారు. అక్కడా ఏమీ లభించలేదు. మా గ్రామంలోనూ వారికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. నేను వెళ్లి వారికి పూర్తిగా సహకారం అందిస్తాను.’ అని తెలిపారు సిసోడియా. ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందనే ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం 15 మంది నిందితుల్లో మనీశ్ సిసోడియా పేరును కూడా చేర్చింది. ఇప్పటికే ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించింది. అవినీతి ఆరోపణలను ఆప్ మొదటి నుంచి ఖండిస్తోంది. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వేలేకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. ఇదీ చదవండి: రైతులకు శుభవార్త.. రేపే పీఎం కిసాన్ 12వ విడత నిధుల విడుదల -
కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డ మనీశ్ సిసోడియా! జరిగింది ఇది..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై.. సొంత పార్టీ నేతనే తీవ్ర విమర్శలు గుప్పించాడు. వ్యాక్సినేషన్లో విఫలమవుతూనే.. మరోపక్క యాడ్ల పేరుతో ప్రజా ధనాన్ని వృథాగా ఖర్చు చేస్తున్నాడంటూ సీఎం కేజ్రీవాల్‌పై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మండిపడ్డాడు. ఈ మేరకు ఓ వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది. న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై, ఆప్ కీలక నేత.. డిప్యూటీసీఎం మనీశ్ సిసోడియా మండిపడ్డట్లు 30 సెకండ్ల నిడివి ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓవైపు సిసోడియా మాట్లాడుతుండగా.. మరోవైపు ఆప్ యాడ్లతో ఉన్న పేపర్ క్లిప్పులు, యాడ్ కట్టింగ్లు కనిపిస్తున్నాయి ఆ వీడియోలో. యాడ్ల పేరుతో ఎంత వృథా చేస్తారు. వ్యాక్సిన్లు దొరక్క ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. అని అందులో డైలాగులు ఉన్నాయి. దీంతో వీడియో విపరీతంగా షేర్ అయ్యింది. ఆప్‌లో ముసలం మొదలైందని, కీలక నేతల మధ్య వైరం షురూ అయ్యిందని రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. Mr. Handsome Sisodia Slams Kejriwal For "No Vaccination, Only Ads". pic.twitter.com/rNMs1fuQro — अमित शर्मा (@AmitsharmaGRENO) June 24, 2021 ఫ్యాక్ట్ చెక్.. ఆ రెండు వేర్వేరు వీడియోలు. ఎవరో ఎడిట్చేసి వైరల్ చేశారు. మనీశ్ సిసోడియా జూన్ 21న నిర్వహించిన ట్విటర్ లైవ్ మీడియా సమావేశంలో ఢిల్లీ వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి మాట్లాడాడు. అదేరోజు ఉదయం ‘‘ ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన ఘనత’ పేరుతో బీజేపీ పాలిత రాష్రా్టల్లో ఫుల్ పేజ్ యాడ్లు పబ్లిష్ అయ్యాయి. అయితే వాస్తవ పరిస్థితి మరోలా ఉందని, గప్పాలు మానుకోవాలని, ప్రచారానికి ఖర్చు పెట్టే డబ్బును వ్యాక్సిన్ల కోసం ఉపయోగించాలని బీజేపీకి సూచిస్తూ సిసోడియా ప్రెస్ మీడియాలో మాట్లాడాడు. అందులోని పోర్షన్లను కట్ చేసి.. ఎవరో ఎడిట్ చేశారు. సో.. మనీష్ సిసోడియా విమర్శించింది సొంత ప్రభుత్వాన్ని కాదు.. కేంద్ర ప్రభుత్వాన్ని. Addressing an important Press Conference | LIVE https://t.co/CCdbez8UeJ — Manish Sisodia (@msisodia) June 21, 2021 చదవండి: రాష్ట్రపతి జీతం, కట్టింగ్‌లపై గోల -
సైకిల్‌పై డిప్యూటీ సీఎం పయనం
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న సరి-బేసి నిబంధనకు మంచి స్పందన వస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ఆయన మంత్రివర్గ సభ్యులు, ఆప్ నేతలు ఈ నిబంధనను అనుసరిస్తున్నారు. కొందరు కార్లను పక్కనబెట్టి సైకిల్, ఆటోలు, బస్సుల్లో ఆఫీసుకు వెళ్లారు. జనవరి 1 నుంచి అమలు చేస్తున్న సరి-బేసి రూల్ ప్రకారం ఢిల్లీలో శనివారం సరి వాహనాలను రోడ్లపైకి అనుమతించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైకిల్ ఎక్కారు. ఢిల్లీలోని ఆలిండియా రేడియో స్టేషన్ ఆఫీసు నుంచి సచివాలయానికి సిసోడియా సైకిల్‌పై వెళ్లారు. శుక్రవారం ఢిల్లీ ఆప్ కన్వీనర్ దిలీప్ పాండే ఆటోలో ఆఫీసుకు వెళ్లారు. సీఎం కేజ్రీవాల్.. రవాణా మంత్రి గోపా ల్‌రాయ్ కారులో సచివాలయానికి వెళ్లారు. సీఎం, గోపాల్‌రాయ్, పీడబ్ల్యూడీ మంత్రి ఒకే కారులో ప్రయాణించారు.