న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ మరోమారు దాడులు చేసింది . లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ సెక్రటేరియట్‌లో తన కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు చేసినట్లు మనీశ్ సిసోడియా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
आज फिर CBI मेरे दफ़्तर पहुँची है. उनका स्वागत है.
— Manish Sisodia (@msisodia) January 14, 2023
इन्होंने मेरे घर पर रेड कराई, दफ़्तर में छापा मारा, लॉकर तलशे, मेरे गाँव तक में छानबीन करा ली.मेरे ख़िलाफ़ न कुछ मिला हैं न मिलेगा क्योंकि मैंने कुछ ग़लत किया ही नहीं है. ईमानदारी से दिल्ली के बच्चों की शिक्षा के लिए काम किया है.
' సీబీఐ అధికారులు ఇవాళ మరోమారు నా కార్యాలయానికి వచ్చారు. వాళ్లకు స్వాగతం పలుకుతున్నా. వాళ్లు నా ఇంట్లో, ఆపీస్‌లో, బ్యాంకు లాకర్‌లో ఇదివరకే తనిఖీలు చేశారు. నా సొంత ఊరికి వెళ్లి కూడా విచారణ జరిపారు. కానీ వాళ్లకు ఏమీ దొరకలేదు. భవిష్యత్తులో కూడా ఏమీ దొరకదు. ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు' అని సిసోడియా ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
చదవండి: 900 కిమీ దూరం.. గంటల వ్యవధిలోనే చనిపోయిన కవల సోదరులు..
Comments
Please login to add a commentAdd a comment