భక్తుల్లో వ్యతిరేకత ఈఓ నిర్ణయాలతో ఏకీభవించని ట్రస్ట్‌బోర్డు
శ్రీశైలం, శ్రీశైల మహాక్షేత్రంలో స్వయంభువుగా వెలసిన శ్రీమల్లికార్జున స్వామిని అష్టదిగ్బంధనం చేయాలనే ఈవో ఆజాద్ నిర్ణయంపై భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈవో నిర్ణయానికి వైదిక కమిటీ తన ఆమోదాన్ని తెలపలేదు. ఆదివారం నిర్వహించిన ట్రస్ట్‌బోర్డు సమావేశంలో ముందు ఆమోదం తెలిపినా..విమర్శలు వెల్లువెత్తుతాయన్న భయంతో ఆ వెంటనే నిర్ణయాన్ని వాయిదా వేశారు. లింగం చుట్టూ గాడి (ఖాళీ) ఏర్పడిందని.
అందులోకి పంచామృతాభిషేకాల జలాలు ప్రవహించడం వల్ల దుర్గంధం వస్తుందనే అభిప్రాయంతో గాడిని పూడ్చివేయాలని ఈవో నిర్ణయించారు. మల్లికార్జునుడి పానుమట్టం కింద మరో పది పానుమట్టాలుంటాయనేది ప్రతీతి. కాలక్రమంలో భూ ఉపరితలం పెరుగుతుండటంతో లింగానికి పానుమట్టాలను అమరుస్తూ వచ్చారని.. ప్రస్తుతం ఉన్నది 11వ పానుమట్టంగా భావిస్తున్నారు. అందువల్లే లింగం చుట్టూ గాడి ఉండటంతో పాటు అందులో నిరంతరం జలం ఊరుతోంది.
మల్లన్నకు అష్టదిగ్బంధనమా?
Published Tue, May 27 2014 2:14 AM | Last Updated on Mon, Jul 29 2019 6:06 PM
Advertisement