శ్రీశైలంలో రూ.10కే అల్పాహారం
శ్రీశైలం: శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థమై వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం రూ. 10కే అల్పాహారాన్ని అందిస్తోంది. పాతాళగంగ రోడ్డు మార్గంలోని నీలకంఠేశ్వర యాత్రిక వసతి సముదాయం వద్ద అల్పాహార కేంద్రాన్ని శనివారం ఏఈఓ, పర్యవేక్షకులు రాజశేఖర్, వెంకటేశ్వర్లు ప్రారంభించారు. సాదారణ భక్తుల సౌకర్యం కోసం తక్కువ ధరలో నాణ్యమైన అల్పహారాన్ని అందించాలనే సంకల్పంతో ఈఓ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. రెండు ఇడ్లీలు, ఉప్మాతో కలిపి నామమాత్రపు రేటుతో రూ. 10కే అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఉదయం 7.30గంటల నుంచి ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు.