కన్నడ భక్తులపై లాఠీచార్జి, ఉద్రిక్తత
Published Fri, Mar 24 2017 12:40 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలం నంది కూడలి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వచ్చిన కన్నడ భక్తులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. కర్ణాటకు నుంచి వచ్చిన ప్రైవేట్ బస్సును నంది కూడలిలో నిలిపి అందులో ఉన్న కన్నడ భక్తులు రోడ్డు పక్కన టిఫిన్ చేస్తుండగా.. పోలీసులు వారితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహానికి గురైన కన్నడ భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో.. పోలీసులు లాఠీచార్జి చేశారు.
Advertisement
Advertisement