
పాతాళ గంగ(పాత చిత్రం)
కర్నూలు జిల్లా : శ్రీశైలంలోని పాతాళ గంగలో వృద్ధ దంపతుల మృతదేహాలు సోమవారం బయటపడ్డాయి. ఉదయం పాతాళ గంగలో నీటిపై మృతదేహాలు తెలియాడుతుండటం అక్కడే చేపలు పడుతున్న వారు గమనించారు. వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎసై వరప్రసాద్ తమ బృందంతో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేశారు. మృతులు గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment