జగదేవ్‌పూర్: మండలంలోని కొండపోచమ్మ దేవాలయన్ని నూతనంగా ఏర్పాటు చేస్తున్న కోమురవెల్లి మండలంలో కలుపవద్దని పీఆర్‌టీయు మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, ప్రధాన కారద్యర్శి శశిధర్‌శర్మ గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు అన్నారు. రెండు పుణ్యక్షేత్రాలు ఉన్నందునే జగదేవ్‌పూర్ మండలానికి గుర్తింపు వచ్చందని పేర్కొన్నారు.
నూతనంగా ఏర్పడుతున్న మర్కూక్ మండలంలోకి జగదేవ్‌పూర్‌నకు చెందిన ఐదు గ్రామాలు విలీనమవుతున్నాయని తెలిపారు. విలీనమయ్యేవాటిలో రెండో కంచిగా పేరున్న వరదరాజ్‌పూర్ గ్రామం కూడా ఉందన్నారు. మరోపుణ్యక్షేత్రం కొండపోచమ్మను కూడా కొమురవెల్లిలో కలిపేందుకు యత్నాలు జరుగుతున్నాయని, అటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.