నేడు కొమురవెల్లికి సీఎం కేసీఆర్ రాక
- హెలీపాడ్‌ను పరిశీలించిన కలెక్టర్, సీఎం సెక్యూరిటీ ఐజీ
చేర్యాల: వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణానికి సీఎం కె.చంద్రశేఖరరావు ఆదివారం రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను కలెక్టర్ కిషన్, సీఎం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఐజీ ఎంఎం.మహేశ్ భగవత్, ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా, క్రైం ఏఎస్పీ జాన్‌వెస్లీ, జనగామ డీఏస్పీ సురేందర్ శనివారం పరిశీలించారు. అనంరతం ఐజీ మహేశ్ భగవత్ హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్ వెళ్లిపోయారు.