హెలికాప్టర్ కొనాలని కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్: కొత్త హెలికాప్టర్ కొనాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రముఖుల ప్రయాణాలు, ప్రభుత్వ పెద్దల రాష్ట్రస్థాయి పర్యటనలకు అనువైన హెలికాప్టర్ గుర్తించాలని అధికారులకు కేసీఆర్ సూచించారు.
ప్రమాదానికి గురైన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జనాభా నిష్పత్తి ఆధారంగా పంచాలని ఆయన డిమాండ్ చేశారు.