కిక్కిరిసిన కొమురవెల్లి
- బోనమెత్తిన మహిళలు
- పోతరాజుల విన్యాసాలు
- మల్లన్న దర్శనానికి ఐదు గంటలు
చేర్యాల, న్యూస్‌లైన్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగం గా చివరి రోజు అగ్నిగుండాలను తిలకించేందు కు భక్తులు భారీగా తరలిరావడంతో ఆదివా రం ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తెలంగాణ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఉదయమే ఆలయానికి చేరుకున్నారు.
దీంతో ఆలయ పరిసరాలు భక్తజనసందోహంగా మారాయి. ఆలయ ప్రాంగ ణం మల్లన్న నామస్మరణతో మార్మోగింది. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య మహిళలు బోనాలు ఎత్తుకుని వచ్చి ఆలయ ప్రాంగణంలోని గంగిరేగు చెట్టు వద్ద స్వామి వారికి బోనాలతోపాటు నైవేద్యం సమర్పించా రు. అనంతరం భక్తులు మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మల్లన్న దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్న అనంత రం భక్తులు ఇంద్రకిలాద్రి కొండపై ఉన్న శ్రీరేణుక ఎల్లమ్మ, నల్లపోచమ్మను దర్శించుకున్నా రు. ఈ సందర్భంగా భక్తులు బోనాలు ఎత్తుకు ని డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల మధ్య సుమారు 500 మె ట్లు ఎక్కి అమ్మవార్లకు బోనాలు సమర్పిం చుకున్నారు. కొంతమంది భక్తులు ఎల్లమ్మ, నల్లపోచమ్మకు ఒడిబియ్యం, కల్లు బోనాలు సమర్పించి, సాకలు పెట్టి పూజలు నిర్వహించారు.
అగ్నిగుండాలకు ఏర్పాట్లు పూర్తి
బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు గంగిరేగు చెట్టు వద్ద భగభగ మండే నిప్పు కణాలను తయారు చేసేందుకు సుమారు 50 క్వింటాళ్ల సమిదలు(కట్టెలు), భక్తులు తిలకించేందుకు ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు. కాగా, అగ్నిగుండాల ఏర్పాట్ల కోసం ఆదివారం రాత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను ఆలయ ఈఓ కాటం రాజు, డీఏస్పీ సురేందర్, సీఐ డెవిడ్, ఎస్సైలు రవీందర్, సూర్యప్రసాద్, ఏఈఓ అంజయ్య, సూపరింటెండెంట్లు సుదర్శన్, చంద్రశేఖర్ పర్యవేక్షించారు.