Mallikarjuna Swami
-
జాతరలో కందిరీగల దాడి
శామీర్పేట్: మూడుచింతలపల్లి మండలం ఉద్దె మర్రి గ్రామంలో నిర్వహిస్తున్న మల్లికార్జునస్వా మి జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. కందిరీ గలు దాడి చేయగా, వాటి బారినుండి తప్పించుకునేందుకు పరిగెడుతున్న వ్యక్తి కిందపడి గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. ఉద్దెమర్రి మల్లికార్జునస్వామి జాతరలో భాగంగా సోమవారం అగ్ని గుండాల కార్యక్రమం చేపట్టగా, భక్తులు పూజలు చేసి అగ్నిగుండాలు దాటుతున్నారు. ఈ క్రమంలో అగ్ని గుండాల నుంచి వచ్చిన పొగ సమీపంలో ఉన్న మర్రి చెట్టుపై ఉన్న కందిరీగల తుట్టెకు తాకింది. దీంతో కందిరీగలు భక్తులపై దాడి చేశాయి. ఒకరినొకరు తోసుకుంటూ భక్తులు పరిగెత్తారు. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన సొప్పరి శ్రీనివాస్ (50)పై కందిరీగలు విరుచుకుపడడంతో వాటి నుండి తప్పించుకునేందుకు శ్రీనివాస్ పరుగులు తీశాడు. కందిరీగలు అతడిని వదలకపోవడంతో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి శ్రీనివాస్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అనంతరం చికిత్స నిమిత్తం నాగారంలోని ఓ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కాగా, కందిరీగల దాడిలో గ్రామస్తులు సైతం గాయాలపాలయ్యారు. -
80ఏళ్ల వయస్సు.. 280 కిలోమీటర్లు పాదయాత్ర
మహబూబ్నగర్: శ్రీశైలంలోని మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు ఎనభై ఏళ్ల వృద్ధురాలు బోరమ్మ 280 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుతోంది. ఆమె ఇలా నడిచి వెళ్లడం ఇదే మొదటిసారి కాదు.. 35 సంవత్సరాలుగా ఇలా నడుచుకుంటూ వెళ్లి స్వామివారిని దర్శించుకుంటోంది. కర్ణాటక రాష్ట్రం జవరిగి ప్రాంతానికి చెందిన బోరమ్మ ఈ ఏడాది కూడా వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా కర్ణాటక నుంచి బయలుదేరి గురువారం మహబూబ్నగర్ జిల్లా గట్టు మండలానికి చేరుకుంది. ‘శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని... దైవానుగ్రహం ఉంటే అన్నీ సాధ్యమని’ చెబుతోంది. తనకు శ్రీశైలం మల్లన్న అంటే ఇష్టమని.. అందుకే 80ఏళ్ల వయస్సున్నా లెక్కచేయకుండా స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం నడుస్తున్నానని చెబుతుంది. ప్రతి ఏటా గట్టుమీదుగానే పాదయాత్ర చేస్తూ, ఆయా ప్రాంతాల్లో పరిచయం ఉన్న వారిని బంధువుల్లా పలుకరిస్తూ, తెలిసిన వారి ఇళ్లలో కొంతసేపు సేదతీరుతుంది. ‘ఏను తాయి చన్నాగి ఇద్దిరా? ఆ మల్లికార్జున ఆశీర్వాదగలు నిమ్మగే ఇరబేకు (ఏం తల్లీ బాగున్నావా? ఆ.. శ్రీశైల మల్లికార్జునుడి ఆశీర్వాదాలు మీకు ఉండును గాక) అంటూ అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, వారిని దీవిస్తూ, వారి ఇళ్లనుంచి చక్కెర తీసుకెళ్లి శ్రీశైలంలో మల్లన్నకు నైవేద్యంగా సమర్పిస్తుంది. అల్పాహారం మాత్రమే తీసుకుని తాను 35ఏళ్లుగా ప్రతిఏటా పాదయాత్ర చేస్తున్నట్లు ఆ వృద్ధురాలు చెబుతోంది. వారం క్రితం తన గ్రామం నుంచి బయల్దేరానని, ఉగాది పండగ కంటే ముందే శ్రీశైలం క్షేత్రానికి చేరుకుంటానని ఆమె తెలిపింది. అక్కడ మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి తిరుగు ప్రయాణం అవుతున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు తన పాదయాత్రకు ఎలాంటి ఆటంకం కలుగలేదని చెప్పింది. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పాదయాత్ర చేస్తూనే ఉంటానని, తనను ఆ శ్రీశైలం మల్లన్నే నడిపిస్తారని ఆ వృద్ధురాలు నమ్మకంతో చెబుతోంది. (గట్టు) -
కిక్కిరిసిన కొమురవెల్లి
బోనమెత్తిన మహిళలు పోతరాజుల విన్యాసాలు మల్లన్న దర్శనానికి ఐదు గంటలు చేర్యాల, న్యూస్లైన్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగం గా చివరి రోజు అగ్నిగుండాలను తిలకించేందు కు భక్తులు భారీగా తరలిరావడంతో ఆదివా రం ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తెలంగాణ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఉదయమే ఆలయానికి చేరుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తజనసందోహంగా మారాయి. ఆలయ ప్రాంగ ణం మల్లన్న నామస్మరణతో మార్మోగింది. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య మహిళలు బోనాలు ఎత్తుకుని వచ్చి ఆలయ ప్రాంగణంలోని గంగిరేగు చెట్టు వద్ద స్వామి వారికి బోనాలతోపాటు నైవేద్యం సమర్పించా రు. అనంతరం భక్తులు మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మల్లన్న దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్న అనంత రం భక్తులు ఇంద్రకిలాద్రి కొండపై ఉన్న శ్రీరేణుక ఎల్లమ్మ, నల్లపోచమ్మను దర్శించుకున్నా రు. ఈ సందర్భంగా భక్తులు బోనాలు ఎత్తుకు ని డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల మధ్య సుమారు 500 మె ట్లు ఎక్కి అమ్మవార్లకు బోనాలు సమర్పిం చుకున్నారు. కొంతమంది భక్తులు ఎల్లమ్మ, నల్లపోచమ్మకు ఒడిబియ్యం, కల్లు బోనాలు సమర్పించి, సాకలు పెట్టి పూజలు నిర్వహించారు. అగ్నిగుండాలకు ఏర్పాట్లు పూర్తి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు గంగిరేగు చెట్టు వద్ద భగభగ మండే నిప్పు కణాలను తయారు చేసేందుకు సుమారు 50 క్వింటాళ్ల సమిదలు(కట్టెలు), భక్తులు తిలకించేందుకు ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు. కాగా, అగ్నిగుండాల ఏర్పాట్ల కోసం ఆదివారం రాత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను ఆలయ ఈఓ కాటం రాజు, డీఏస్పీ సురేందర్, సీఐ డెవిడ్, ఎస్సైలు రవీందర్, సూర్యప్రసాద్, ఏఈఓ అంజయ్య, సూపరింటెండెంట్లు సుదర్శన్, చంద్రశేఖర్ పర్యవేక్షించారు.