మృతి చెందిన శ్రీనివాస్
శామీర్‌పేట్: మూడుచింతలపల్లి మండలం ఉద్దె మర్రి గ్రామంలో నిర్వహిస్తున్న మల్లికార్జునస్వా మి జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. కందిరీ గలు దాడి చేయగా, వాటి బారినుండి తప్పించుకునేందుకు పరిగెడుతున్న వ్యక్తి కిందపడి గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. ఉద్దెమర్రి మల్లికార్జునస్వామి జాతరలో భాగంగా సోమవారం అగ్ని గుండాల కార్యక్రమం చేపట్టగా, భక్తులు పూజలు చేసి అగ్నిగుండాలు దాటుతున్నారు.
ఈ క్రమంలో అగ్ని గుండాల నుంచి వచ్చిన పొగ సమీపంలో ఉన్న మర్రి చెట్టుపై ఉన్న కందిరీగల తుట్టెకు తాకింది. దీంతో కందిరీగలు భక్తులపై దాడి చేశాయి. ఒకరినొకరు తోసుకుంటూ భక్తులు పరిగెత్తారు. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన సొప్పరి శ్రీనివాస్ (50)పై కందిరీగలు విరుచుకుపడడంతో వాటి నుండి తప్పించుకునేందుకు శ్రీనివాస్ పరుగులు తీశాడు. కందిరీగలు అతడిని వదలకపోవడంతో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి శ్రీనివాస్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అనంతరం చికిత్స నిమిత్తం నాగారంలోని ఓ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కాగా, కందిరీగల దాడిలో గ్రామస్తులు సైతం గాయాలపాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment