Wasp attack
-
జాతరలో కందిరీగల దాడి
శామీర్‌పేట్: మూడుచింతలపల్లి మండలం ఉద్దె మర్రి గ్రామంలో నిర్వహిస్తున్న మల్లికార్జునస్వా మి జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. కందిరీ గలు దాడి చేయగా, వాటి బారినుండి తప్పించుకునేందుకు పరిగెడుతున్న వ్యక్తి కిందపడి గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. ఉద్దెమర్రి మల్లికార్జునస్వామి జాతరలో భాగంగా సోమవారం అగ్ని గుండాల కార్యక్రమం చేపట్టగా, భక్తులు పూజలు చేసి అగ్నిగుండాలు దాటుతున్నారు. ఈ క్రమంలో అగ్ని గుండాల నుంచి వచ్చిన పొగ సమీపంలో ఉన్న మర్రి చెట్టుపై ఉన్న కందిరీగల తుట్టెకు తాకింది. దీంతో కందిరీగలు భక్తులపై దాడి చేశాయి. ఒకరినొకరు తోసుకుంటూ భక్తులు పరిగెత్తారు. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన సొప్పరి శ్రీనివాస్ (50)పై కందిరీగలు విరుచుకుపడడంతో వాటి నుండి తప్పించుకునేందుకు శ్రీనివాస్ పరుగులు తీశాడు. కందిరీగలు అతడిని వదలకపోవడంతో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి శ్రీనివాస్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అనంతరం చికిత్స నిమిత్తం నాగారంలోని ఓ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కాగా, కందిరీగల దాడిలో గ్రామస్తులు సైతం గాయాలపాలయ్యారు. -
టీఆర్ఎస్ కార్యకర్తలపై కందిరీగల దాడి
తప్పించుకున్న హరీశ్‌రావు తూప్రాన్ : కందిరీగల దాడి నుంచి మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్తకోట ప్రభాకర్‌రెడ్డిలు తప్పించుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం రమాయిపల్లి వద్ద ఓ ప్రైవేట్ అతిథి గృహంలో శనివారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కొందరు కార్యకర్తలు పక్క మామిడితోటలో కాయలు కోయగా.. అక్కడున్న కందిరీగలు చెదిరి సమావేశ మందిరంలోకి చొరబడ్డాయి. విషయం తెలుసుకున్న మంత్రి, ఎంపీలు కారెక్కి వెళ్లిపోయారు. కందిరీగల దాడిలో పలువురు గాయపడ్డారు. -
కందిరీగల దాడి: ఒకరు మృతి
పుట్లూరు (అనంతపురం): కందిరీగల రూపంలో ఎదురైన ఆపద నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ ఓ వ్యక్తి ఐచర్ వాహనం కిందపడి చనిపోయాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో శుక్రవారం జరిగింది. పుట్లూరు మండలంలోని ఎల్లుట్ల- మడ్డిపల్లి ప్రధాన రహదారి పక్కన గులకరాళ్లను ట్రాక్టర్లోకి నింపుతున్న వ్యవసాయ కూలీలపై కందరీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో కూలీలు తప్పించుకునేందుకు పరుగులు తీశారు. నారాయణరెడ్డిపల్లికి చెందిన జయచంద్ర(40) రోడ్డుపైకి పరుగు తీశాడు. అదే సమయంలో ఎల్లుట్ల నుంచి మడ్డిపల్లికి అరటి గెలలను తీసుకెళుతున్న ఐచర్ వాహనం అతివేగంగా వచ్చి అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. జయచంద్రకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.