కందిరీగల దాడి: ఒకరు మృతి | one died in Wasp attack | Sakshi
Sakshi News home page

కందిరీగల దాడి: ఒకరు మృతి

Published Fri, Feb 6 2015 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM

one died in Wasp attack

పుట్లూరు (అనంతపురం): కందిరీగల రూపంలో ఎదురైన ఆపద నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ ఓ వ్యక్తి ఐచర్ వాహనం కిందపడి చనిపోయాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో శుక్రవారం జరిగింది. పుట్లూరు మండలంలోని ఎల్లుట్ల- మడ్డిపల్లి ప్రధాన రహదారి పక్కన గులకరాళ్లను ట్రాక్టర్‌లోకి నింపుతున్న వ్యవసాయ కూలీలపై కందరీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో కూలీలు తప్పించుకునేందుకు పరుగులు తీశారు.

నారాయణరెడ్డిపల్లికి చెందిన జయచంద్ర(40) రోడ్డుపైకి పరుగు తీశాడు. అదే సమయంలో ఎల్లుట్ల నుంచి మడ్డిపల్లికి అరటి గెలలను తీసుకెళుతున్న ఐచర్ వాహనం అతివేగంగా వచ్చి అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. జయచంద్రకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement