గోదావరి పుష్కరాల్లో విధులు నిర్వహిస్తున్న పురోహితుల నుంచి ధర్మాన్ని కాపాడే ఓశాఖ అధికారి కక్కుర్తి పడుతున్నారనే .....
ఒక్కోపురోహితుడి నుంచి రూ.500 వసూలు
ములుగు: గోదావరి పుష్కరాల్లో విధులు నిర్వహిస్తున్న పురోహితుల నుంచి ధర్మాన్ని కాపాడే ఓశాఖ అధికారి కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. మంగపేట గోదావరి పుష్కర ఘాట్ వ ద్ద అధికారింగా 30 మంది అర్చకులను నియమించారు. మంగపేట గోదావరి పుష్కరాలకు భక్తుల రద్దీ పెరగడంతోపాటు పిండ ప్రదానాలు చేయడానికి పురోహితులకు డిమాండ్ పెరిగింది. గమనించిన ఓ అధికారి వారి ఆదాయం నుంచి వాటా అడుగుతున్నట్లు సమాచారం.
తాను నియమించిన పురోహితుల నుంచి రోజువారీగా ఒక్కొకరి నుంచి రూ.500 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అంతేగాకుండా పురోహితుల పేరుతో సదరు అధికారి అర్హతలేని అర్చకులను నియమించారని ఆరోపణలొస్తున్నారుు. పుష్కరాలకు ముందే తనకు తెలిసిన పురోహితులను సంప్రదించి పుష్కర డ్యూటీలు పడేలాచేశాడని తెలిసింది. అంతేగాకుండా తనకు తెలిసిన ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన పురోహితులను రప్పించారని సమాచారం.