తిరుమలలో పీఠాధిపతులకు మహా అవమానం | Priests and Swamijis angry over TDP Govt | Sakshi
Sakshi News home page

తిరుమలలో పీఠాధిపతులకు మహా అవమానం

Published Wed, Mar 13 2019 9:59 AM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

పీఠాధిపతులు, స్వామీజీలకు తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో ‘మహా’ అవమానం జరిగింది. వారు ఇప్పటివరకు మహాద్వారం ద్వారా ప్రవేశించి శ్రీవెంకటేశ్వరుని దర్శనం చేసుకునేవారు. అయితే ఇకమీదట స్వామివారి దర్శనానికి సాధారణ భక్తుల మాదిరే వారు క్యూలైన్‌లోనే వెళ్లాలట. తిరుమల ఆలయంలో ప్రముఖులకు నేరుగా మహాద్వారం ప్రవేశంపై చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా జారీ చేసిన సరికొత్త జీవో పెద్ద దుమారం రేపుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన రోజు ఆదివారం సెలవు దినమైనప్పటికీ సీఎం చంద్రబాబు హడావుడిగా ఈ జీవోను జారీ చేయించారు. ఈ జీవోను హిందూ మతపెద్దలు, బ్రాహ్మణ సంఘాలు, అర్చకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement