
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. అర్చకుల చిరకాల స్వప్పమైన వంశపారంపర్య హక్కులను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే చట్టం అమల్లోకి తెచ్చారు. 2007 లో మహానేత వైఎస్సార్ అర్చకులకు వంశపారంపర్య చట్టాన్ని తీసుకురాగా, గత పదేళ్లుగా ఏ ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయలేదు. పదేళ్ల తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ చట్టాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది. అర్చకులకు వంశపారంపర్య హక్కులను కల్పిస్తూ జీవో విడుదల చేయడం పట్ల అర్చక సమాఖ్య ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీని నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment