పుష్కరఘాట్ (రాజమండ్రి): పుష్కరఘాట్‌లో పోలీసులు అవలంబిస్తున్న వైఖరికి పురోహితులు తీవ్ర మనస్తాపం చెందుతున్నారు. పుష్కరాల్లో తీర్థవిధులు నిర్విహించే పురోహితులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేసింది. భక్తులు తెల్లవారుజాము నుంచి బారులు తీరుతుండటంతో అప్పటి నుంచి పురోహితులు తీర్థవిధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పుష్కరఘాట్‌లో తీర్థవిధులు నిర్వహిస్తున్న పురోహితులు మధ్యలో అల్పాహారం కోసం, ఇతర పనుల నిమిత్తం ఘాట్ నుంచి బయటకు వెళ్లి తిరిగి వస్తుంటే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పురోహితులు కూడా అందరిలాగా క్యూలోనే రావాలని ఆంక్షలు విధిస్తున్నారు. దీనిపై వీరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాల్లో మిగిలిన నాలుగు రోజులైనా తమపై ఆంక్షలు లేకుండా చూడాలని కోరుతున్నారు.
ఆర్థికంగా నష్టపోతున్నాం
బయటకు వెళ్లి ఘాట్‌లోకి తిరిగి వచ్చేటప్పు డు క్యూలో వేచి ఉండా ల్సి వస్తోంది. సాధారణ భక్తులతో పాటు క్యూలోనే రావాలని ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నాము.
- లట్టాల కృష్ణప్రసాద్, పురోహితుడు, సీతానగరం
మాకూ సడలింపు ఇవ్వాలి
ఈ విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం మాకు గుర్తింపు కార్డులు మంజూరు చేసింది. పుష్కర విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఇచ్చినట్టే మాకూ సడలింపు ఇవ్వాలి.
- ఎ.రంగారావు, పురోహితుడు, విశాఖపట్నం
పోలీసుల వైఖరితో పురోహితుల మనస్తాపం..
Published Wed, Jul 22 2015 12:53 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement