వెంకన్నకే శఠగోపమా బాబూ.. | Priests salaries increase cm not makes | Sakshi
Sakshi News home page

వెంకన్నకే శఠగోపమా బాబూ..

Published Tue, Jun 30 2015 3:23 AM | Last Updated on Tue, Aug 14 2018 4:39 PM

వెంకన్నకే శఠగోపమా బాబూ.. - Sakshi

వెంకన్నకే శఠగోపమా బాబూ..

- సీపీఐ రాష్ట్ర నేత హరినాథరెడ్డి ధ్వజం
తిరుపతి కల్చరల్:
ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని అర్చకులకు నెలకు రూ.5 వేల జీతం ఇస్తామన్న హామీని అమలు చేసేందుకు టీటీడీ నిధులకు ఎసరు పెట్టేందుకు సిద్ధమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పి.హరినాథరెడ్డి విమర్శించారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అర్చకుల జీతాల చెల్లింపునకు అక్రమంగా శ్రీవారి నిధులను తీసుకుపోవాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు మాట్లాడుతూ జూలై 3, 4 తేదీల్లో మహిళా సమాఖ్య జిల్లా శిక్షణాతరగతులు, 11న జిల్లా సర్వసభ్య సమావేశం, 17, 18, 19 తేదీల్లో మదనపల్లెలోని హార్సిలీ హిల్స్‌లో సభ్ కమిటీ సభ్యులకు రాజకీయ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు చిన్నం పెంచలయ్య, ఆర్.వెంకయ్య, పి,.వెంకటరత్నం, పి.మురళి, ఆర్.హరిక్రిష్ణ, నాగరాజు, పిఎల్.నరసింహులు, రామచంద్రయ్య పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement