- తొలగించిన అంగన్‌వాడీ కార్యకర్తలను విధుల్లోకి తీసుకోవాలి
- నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు
నెల్లూరు(రెవెన్యూ): ఎన్నికల ముందు మహిళా సాధికారత కోసం నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారని నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. తొలగించిన అంగన్‌వాడీ కార్యకర్తలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అకిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టర్ జానకికి వినతిపత్రం సమర్పించారు. సిటీ ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మహిళా దినోత్సవం రోజున మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతినేలా ప్రవర్తించారన్నారు. సమస్యలను ప్లకార్డుల రూపంలో ప్రదర్శించినందుకు బహుమతిగా 14 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఒక ఆయాను విధుల నుంచి తొలగించారన్నారు.
సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తుంటే వారికి మద్దతు తెలిపిన తోటి కార్యకర్తలకు మెమోలిచ్చారన్నారు. సమస్యలపై పోరాటం చేసే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. తొలగించిన అంగన్‌వాడీలను తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు పొరాటాలు కొనసాగించాలన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడవక ముందే అంగన్‌వాడీ కార్యకర్తలను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వుల ఇవ్వడం అన్యాయమన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ కార్యకర్తలు వేతనాలు పెంచారన్నారు. ఏపీలో మాత్రం సీఎం తొందరపాటు నిర్ణయంతో అంగన్‌వాడీ కార్యకర్తలు రోడ్డున పడ్డారన్నా రు. తొలగించిన అంగన్‌వాడీ కార్యకర్తలను తిరిగి విధుల్లోకి తీసుకునేంతవరకు అందరం కలసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్ ఖలీల్‌అహ్మద్, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులు మహేష్, ముస్తాక్‌అహ్మద్, ముసఫిర్‌హుసేన్, కాంగ్రెస్ నాయకుడు ఏసీ సుబ్బారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, మాదాల వెంకటేశ్వర్లు, మూలం రమేష్, సీపీఐ నాయకులు ప్రభాకర్, నరహరి, వినోద్, సీపీఐ(ఎంఎల్) కొండమ్మ, సీఐటీయూ నాయకులు సుబ్బరావమ్మ, మస్తాన్‌బీ, స్వరూపరాణి, శేషమ్మ, హైమావతి, శ్యామల, హెప్సిబా పాల్గొన్నారు.
నియంతలా వ్యవహరిస్తున్న బాబు
Published Tue, May 5 2015 4:34 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
Advertisement