ఎన్నికల కమిషన్‌కు ఏపీ మహిళా కమిషన్ విజ్ఞప్తి సాక్షి, అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు (గర్భిణులు, బాలింతల) పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఏపీ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖను గురువారం మీడియాకు విడుదల చేశారు.
పోలింగ్ బూత్‌ల వద్ద మహిళలకు ప్రత్యేక క్యూలైన్‌లు ఏర్పాటుచేయాలని, బాలింతల కోసం ఫీడింగ్ రూమ్ అందుబాటులో ఉంచాలని కోరారు. గర్భిణులకు అత్యవసర పరిస్థితిలో వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఓటు వేసేందుకు వచ్చే మహిళలు వడదెబ్బకు గురికాకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద షెల్టర్లు ఏర్పాటుచేయాలని, మంచినీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
మహిళల కోసం ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. దాడులు, లైంగికదాడులు, వేధింపులకు గురైన మహిళలకు తగిన న్యాయం చేసేందుకు, బాధితులను పరామర్శించేందుకు మహిళా కమిషన్ చైర్‌పర్సన్, సభ్యులకు ఎన్నికల నిబంధనలలో సడలింపు ఇవ్వాలని కోరారు. గిరిజన మహిళలకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించేందుకు మహిళా కమిషన్‌కు అనుమతివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment