కడప కల్చరల్: నిరంతరం దేవునిసేవలో ఉంటూ భక్తుల కోరికలు, కష్టాలను దైవానికి తెలుపుతూ వారికి స్వాంతన ఇచ్చేందుకు కృషి చేస్తున్న అర్చకులకు ప్రభుత్వం వరాలు ప్రకటించింది. కుటుంబాన్ని పోషించే స్థాయి, ఆర్థిక స్థోమత లేక నిరాశ, నిస్పృహాలతో కొట్టుమిట్టాడుతున్న వారి జీవితాల్లో కూడా ఆనందోత్సాహాలు వెల్లివిరిసే సమయం వచ్చింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వీరి జీతాలను పెంచింది. అనుకోని ఈ వరానికి ఎంతో ఆనంద పడుతున్న అర్చక లోకానికి ప్రభుత్వం రాష్ట్ర దేవదాయశాఖ ద్వారా మరింత సంతోషాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పలు సంక్షేమ పథకాలను రూపుదిద్దింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ కోరుతున్నారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
రాష్ట్రంలోని దేవాదాయశాఖ పరిధిలోగల దేవాలయాలలో సేవలు అందిస్తున్న అర్చకుల (కుటుంబ) సంక్షేమం కోసం వారి ఆర్థిక అభివృద్ధి కోసం ఆ శాఖ ప్రత్యేక కార్యచరణను అమలు చేస్తోంది. గత మాసంలో దాన్ని రాష్ట్ర అధికారులు ముఖ్యమంత్రి సూచన మేరకు మరికొంత ఆర్థిక లాభం లభించేలా సవరణలు చేశారు. దానికి దేవదాయశాఖ మంత్రి ఆమోదం కూడా లభించింది. ఇందులో భాగంగా ఆ శాఖ అర్చక ఉద్యోగుల సంక్షేమ నిధి నుంచి ఆర్థికసాయం అందజేయనున్నారు.
దీనికి రాష్ట్ర అర్చక సమాఖ్య కూడా అంగీకరించింది. అర్చకులు, దేవదాయశాఖలోని ఇతర ఉద్యోగులు ఈ సంక్షేమ పథకాల కోసం ఆ నిధి నుంచి ఆర్థికసాయం తీసుకోవచ్చు. ఆలయాల గ్రేడ్, ఆస్తులు, ఆదాయాన్ని బట్టి అధికారులు అర్హతను నిర్ణయిస్తారు. రుణాలు సులభంగానే పొందవచ్చు. తీసుకున్న వారు సకాలంలో చెల్లిస్తే మరోసారి మరింత సులభంగా రుణాలు పొందవచ్చు. అర్చకుడు లేదా అర్హతను బట్టి వారి కుటుంబ సభ్యులకు వారి బ్యాంకు ఖాతాలోనే సొమ్ము జత చేస్తారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఆయా ఆలయాల ద్వారా నేరుగా ఆ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌కు పంపాల్సి ఉంటుంది. ఆయన వాటిని పరిశీలించి రుణానికి సిఫార్సు చేసి ప్రధాన కార్యాలయానికి పంపుతారు.
రుణాలు....వివరాలు
వివాహ రుణం: దీనికి రూ. లక్ష రుణం లభిస్తుంది. అర్చకుడు తనకు, తన సంతాన వివాహానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు వివాహ శుభలేఖను కూడా జతపరచాల్సి ఉంది. నామమాత్రపు వడ్డీతో ప్రతినెలా కంతు చెల్లించే అవకాశం కల్పించారు.
ఉపనయనం గ్రాంట్: దీనికోసం రూ. 25 వేలు ఇస్తారు. ఇది అర్చకుల సంతానానికి మాత్రమే లభిస్తుంది. మనవళ్లకు, దేవదాయశాఖ కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా దత్తత తీసుకున్న పిల్లలకు ఈ సౌకర్యం లేదు.
గృహ నిర్మాణ రుణం: దీనికి రూ. 5 లక్షల వరకు రుణం ఇస్తారు. సగం రుణంగా, సగం గ్రాంట్‌గా అందజేస్తారు. రెండు విడతలుగా నిర్మాణం సాగుతున్న సమయంలో ఫోటోలు, స్థలం వివరాలు, పొసెసన్ సర్టిఫికెట్, సేల్‌డీడ్, నోటరైజ్డ్ కాపీ, గ్రామ పంచాయతీ ఆమోదం పొందిన ప్లాన్, సర్వేయర్ రూపొందించిన నిర్మాణ అంచనా. ఇద్దరు సహా ఉద్యోగుల హామీ పత్రాలు సమరి్పంచాలి. నిబంధనల మేరకు రెండు విడతలుగా సొమ్ము మంజూరవుతుంది.
గృహ మరమ్మతులు: దీనికి రూ. 2 లక్షలు మంజూరు చేస్తారు. ఇందులో రూ. లక్ష రుణం, మరొక రూ. లక్ష గ్రాంటుగా ఇస్తారు. సంబంధిత ఫోటోలు, ఎస్టిమేషన్లు, అనుమతులు, సేల్ డీడ్‌లను జత పరుస్తూ దరఖాస్తు చేసుకోవాలి.
వైద్య రుణం చెల్లింపు: ఈ రుణానికి అర్హత కోసం వ్యాధిగ్రస్తుల వ్యాధి వివరాలు, వైద్య పరీక్షల రిపోర్టు, స్రూ్కటినీ సరి్టఫికెట్ దరఖాస్తుకు జత చేయాలి. ఆ వ్యాధి ఆరోగ్యశ్రీలో లేకుంటే రూ. 2 లక్షలు వైద్య ఖర్చులకు మంజూరు చేస్తారు. ఈ సంవత్సరం (2021) మే నెల 15వ తేది తర్వాత సమర్పించిన క్లెయిమ్‌లకు మాత్రమే ఈ రుణం వర్తిస్తుంది. వైద్య ఖర్చులు అయిన ఆరు నెలల కాలంలో సమరి్పంచే దరఖాస్తులకే రుణం వస్తుంది. అత్యవసర సమయంలో ‘లెటర్ ఆఫ్ క్రెడిట్’ సౌకర్యం ఉంది.
అంగవైకల్యం: గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు అవకాశం. దేవదాయశాఖలో 10 సంవత్సరాలకు పైబడిన సర్వీసు, శాశ్వత అంగవైకల్యంతో విధులు నిర్వర్తించలేని స్థితిలో ఉన్న వారికి ఈ సౌకర్యం వర్తిస్తుంది. 5–10 సంవత్సరాల సరీ్వసు గల వారికి రూ. లక్ష మంజూరు చేస్తారు. జిల్లా ఆరోగ్య అధికారి ధృవపత్రం సమరి్పంచాల్సి ఉంటుంది.
విద్యా గ్రాంటు: దీనికి రూ. 33 వేలు మాత్రమే మంజూరు చేస్తారు. న్యాయ, ఇంజనీరింగ్, మెడిసిన్, చార్టెడ్ అకౌంటెంట్ లాంటి ఉన్నత లేదా వృత్తి విద్యలకు మాత్రమే రుణం ఇస్తారు. ప్రభుత్వం ఇస్తున్న విద్యా దీవెన, ఫీజు రీఎంబర్స్‌మెంట్ తదితర సౌకర్యం పొందని వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ గుర్తింపుగల విద్యా సంస్థల్లో చదువుతున్న సరి్టఫికెట్ సమరి్పంచాలి. మొదటి సంవత్సరం పాసయ్యాక గ్రాంటు విడుదల చేస్తారు.
రిటైర్డ్‌మెంట్ గ్రాంటు : గ్రాట్యూటీ సాయం పొందుతున్న ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు ఈ శాఖలో ఏ బకాయి లేని వారికి ఈ సౌకర్యం ఉంది. 20 సంవత్సరాలు పైబడిన సర్వీసు గల వారికి రూ. 4 లక్షలు, 15–20 సంవత్సరాలలోపు సరీ్వసు గల ఉద్యోగికి రూ. 3 లక్షలు, 10–15 సంవత్సరాల సర్వీసుగల వారికి రూ. 2 లక్షలు ఇస్తారు. కుటుంబ సభ్యులు లీగల్ హేర్ సర్టిఫికెట్ సమర్పిస్తే 50 శాతం నగదు, 50 శాతం ఫిక్స్‌డ్ సర్టీఫికెట్ ఇస్తారు. దీనికి అవసరమైన అన్ని సర్టిఫికెట్లు సమర్పించాలి.
ఎక్స్‌గ్రేషియా: ఉద్యోగి సర్వీసులో మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ. లక్ష ఎక్స్‌గ్రేíÙయా ఇస్తారు. సాధారణ మరణమైతే రూ. 50 వేలు ఇస్తారు. కనీసం మూడు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసినా లేదా ప్రమాదంలో మరణించిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. డెత్ సరి్టఫికెట్‌తోపాటు సంబం«ధిత ఇతర సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment