సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి టీటీడీ వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. సీఎంను శేషవస్త్రంతో వేద పడింతులు సత్కరించారు. అనంతరం స్వామివారి ప్రసాదం, క్యాలెండర్‌ను అందించారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హాజరయ్యారు.
కాగా, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఇంటిలో ఆనందాలను నింపాలని, మంచి ఆరోగ్యం అందించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం తన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment