హైదరాబాద్, న్యూస్‌లైన్: అర్చకుల సమస్యలను మేనిఫెస్టోల్లో పొందుపరిచే పార్టీలకే వచ్చే ఎన్నికల్లో వుద్దతు ఇస్తావుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అర్చక సమాఖ్య పేర్కొంది. అర్చకుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న 33/87 చట్టాన్ని రద్దుచేయూలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని అర్చక సంఘం కార్యాలయంలో సమాఖ్య ఉపాధ్యక్షుడు సౌందరరాజన్, ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు విలేకరులతో మాట్లాడారు. వైఎస్.రాజశేఖరరెడ్డి అర్చకుల సమస్యల పరిష్కారం కోసం దేవాదాయశాఖ చట్టాన్ని సవరించి 33/2007ను రూపొందించారని, అరుుతే అధికారులు ఆ చట్టానికి వక్రభాష్యం చెబుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేవాలయాల్లో రాజకీయనాయకుల జోక్యాన్ని తగ్గించి ఆలయాల పవిత్రతను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.
తమ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండే పార్టీకే తవు వుద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అర్చక సమాఖ్యల ఆధ్వర్యంలో ఈ నెల 2న అర్చక శంఖారావం నిర్వహిస్తున్నామని చెప్పారు. కాచిగూడలోని మున్నూరు కాపు సంఘం భవనంలో ఉదయం 10 గంటలకు శంఖారావం ప్రారంభమవుతుందని వారు వివరించారు. ఈ సభలో వైఎస్సార్‌సీపీ నుంచి జనక్ ప్రసాద్, మైసూరారెడ్డిలతో పాటు ఇతర పార్టీల నేతలు పాల్గొంటారని చెప్పారు.