
ఉద్యోగులు, అర్చకులకు నెలనెలా వేతనం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేవాలయ ఉద్యోగులు, అర్చకులకు ప్రతి నెలా వేతనాలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వారికి కనీస వేతనాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. శనివారం ప్రగతి భవన్‌లో అర్చక సమాఖ్య, దేవాలయ ఉద్యోగ సంఘాల నేతలు ఉపేంద్రశర్మ, మోహన్ తదితరులు సీఎంను కలసి వేతనాలపై వినతిపత్రం సమర్పించారు.