అర్చకులకు 010 పద్దు కింద వేతనాలివ్వాలని టీజేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు.
నల్లగొండ మున్సిపాలిటీ: అర్చకులకు 010 పద్దు కింద వేతనాలివ్వాలని టీజేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. నల్లగొండలో బుధవారం జరిగిన అర్చక సమాఖ్య రాష్ట్ర స్థాయి సమావేశంలో కోదండరాం మాట్లాడారు. ఈ విషయమై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్ కోసం వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని, ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు వనరులు సమకూర్చాలని పేర్కొన్నారు. ఇంకా విభజన పూర్తికాని 35 సంస్థల ఉద్యోగులను వెంటనే వేరు చేసి రెండు రాష్ట్రాలకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.