చంద్రబాబూ.. తీరు మార్చుకో.. | Kodandaram fires on chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. తీరు మార్చుకో..

Published Sun, Mar 5 2017 3:06 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

చంద్రబాబూ.. తీరు మార్చుకో.. - Sakshi

చంద్రబాబూ.. తీరు మార్చుకో..

రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడొద్దు: కోదండరాం

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయపబ్బం గడుపుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నాడని, తెలంగాణ ప్రజలను అవమానించడం మానుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటు వల్ల సీమాంధ్రకు నష్టం లేదని, అభివృద్ధి చెందడానికి మరో అవకాశం వచ్చిందన్నారు. పిడికెడు సీమాంధ్ర రాజకీయ నాయకులు, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే బాబు అలా మాట్లాడుతున్నాడని ఆరోపించారు.

తెలంగాణకు అనుకూలమే అని చెప్పిన బాబు, ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని ప్రయ త్నించాడని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా బాబు తన వైఖరి మార్చుకోకపోవడం దురదృష్ట కరమన్నారు. తెలంగాణపై ద్వేషపూరిత వైఖరే అనేక అంశాల్లో విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాకుండా నత్తనడకన సాగడానికి కారణమని పేర్కొన్నారు. తెలంగాణలో  సీమాంధ్ర నాయకులు, పెట్టుబడిదారుల జోక్యాన్ని ఖండిస్తున్నామన్నామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement