క్రమబద్ధీకరణం
అక్రమ భవన నిర్మాణదారులకు శుభవార్త. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్యారాజ్యంగా చేపట్టిన నిర్మాణాలకు రాజముద్ర పడనుంది. దశాబ్దం క్రితం అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తూ సక్రమ నిర్మాణాలుగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆరుమాసాల గడువు ఇచ్చింది.
♦ అక్రమ నిర్మాణాలకు అవకాశం
♦ 2007 క్రితం నాటి నిర్మాణాల క్రమబద్ధీకరణ
♦ ఆరునెలల గడువు
♦ ప్రభుత్వానికి తీవ్ర నష్టమని వ్యతిరేకత
సాక్షి ప్రతినిధి, చెన్నై:
చెరువులు, నీటి నిల్వ ప్రాంతాలు, స్థానిక సంస్థలకు సొంతమైన స్థలాలు, ప్రజా వినియోగానికి కేటాయించిన ప్రదేశాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను అనర్హమైనవిగా గుర్తించి విద్యుత్, తాగునీటి వసతిని తొలగిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. చెన్నై శివారు ప్రాంతాలు గ్రేటర్ చెన్నైలో కలిసిపోగా ఆయా ప్రాంతాల్లో నివాస గృహాలు, వాణìజ్య సముదాయాలు నిర్మించాలంటే చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఎండీఏ), డైరెక్టర్ టౌన్, కంట్రీ ప్లానింగ్ కమిటీ (డీటీసీపీ)నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.
ఈ రెండు సంస్థలు సూచించే నియమ నిబంధనలు, భద్రతా సూచనలను పాటించకుండా నిర్మాణాలు జరిపితే ప్రమాదాలు చోటుచేసుకోగా కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గ్రేటర్ చెన్నై చట్టంలో 113సీ పేరుతో సవరణ చట్టాన్ని తెచ్చారు. నిబంధనలను అతిక్రమించి 2007 జూలై 1వ తేదీ క్రితం నాటి నిర్మాణాల గణాంకాలను సేకరించి క్రమబద్ధీకరణకు రిటైర్డు న్యాయమూర్తి రాజేశ్వరన్ చైర్మన్‌గా 2014లో కమిటీ ఏర్పడింది.
ఈ కమిటీలో సభ్యులుగా పలువురు అధికారులు, నిర్మాణరంగ నిపుణులుగా ఉన్నారు. ఈ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి కొన్ని సిఫార్సులు చేసింది. కమిటీ చేసిన సిఫార్సులను మంత్రివర్గం ఇటీవలే ఆమోదించి అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి నోటీసు వెలువడిన నాటి నుంచి ఆరు నెలల్లోగా క్రమబద్ధీకరణను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. క్రమబద్ధీకరణ పరిధిలోకి రాని నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ సిబ్బందికి అధికారాలు ఇచ్చారు.
ఓవైపు వ్యతిరేకత
అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. నీటి నిల్వ ప్రాంతాలు, ప్రభుత్వ పొరంబోకు స్థలాల్లో నిర్మాణాలను ప్రభుత్వమే అనుమతించడం వల్ల కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమ నిర్మాణా లు, ఆక్రమణలపై పరిసరాల్లోని ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్నారు. సీఎండీకే, డీటీసీపీ అధికారుల ఉదాసీనతకు ప్రజలు ప్రాణాలు కోల్పోతూ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారనే ఆవేదన వ్యక్తం అవుతోంది. చెన్నై మౌళివాక్కంలో 61 మందిని బలిగొన్న 11 అంతస్తుల నిర్మాణం, ఇటీవల నిట్టనిలువునా కాలిపోయిన టీనగర్‌లోని చెన్నై శిల్క్స్ భవనాన్ని ఉదహరిస్తున్నారు.
క్రమబద్ధీకరణకు ఇవీ నిబంధనలు
♦ ఆయా నిర్మాణాలు 2007 జూలై 1 కంటే ముందు నిర్మించి ఉండాలి.
♦ కొత్తగా చేపట్టబోయే నిర్మాణాలు ఎయిర్ కంట్రోల్, సముద్రతీర ప్రాంతాల, ఎయిర్‌ఫోర్సు, సైనిక దళాల, కొండ ప్రాంతాల, తమిళనాడు న్యూక్లియర్ సంస్థల నిబంధనలకు నిర్మాణాలు కట్టుబడి ఉండాలి.
♦ వీధులు, రోడ్లు, జాతీయ రహదారులు, ప్రభుత్వ, స్థానిక సంస్థలకు సొంతమైన ప్రదేశాలు, నీటి నిల్వ ప్రాంతాలు, నగర అభివృద్ధి పథకాల పరిధిలోని ప్రాంతాలు, పార్కులు, ప్రజోపయోగంలో ఉండే బహిరంగ స్థలాల్లో నిర్మించిన వాటిని క్రమబద్ధీకరించేందుకు వీలు లేదు.
♦ రోడ్ల విస్తరణకు అనువైన ప్రదేశాలు, వాహనాలు నిలిపే ప్రదేశాలు తదితరాల్లోని నిర్మాణాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా కమిటీ సిఫార్సు చేసింది.
♦ క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం చెల్లించాల్సిన సొమ్ము, విస్తరించిన ప్రాంతానికి రుసుం, జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది.
♦ అపార్టుమెంట్ల నిర్మాణాల్లో కారు పార్కింగ్ సరిగా లేకుంటే రూ.10 వేలు, వాణిజ్య సముదాయాల్లో చెన్నైలో అయితే రూ.1లక్ష, శివార్లలో రూ.50 వేలు, ద్విచక్రవాహన పార్కింగ్‌లో లోపాలుంటే రూ.2,500లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంద