అక్రమబద్ధీకరణే లక్ష్యం
కొండవాలు ప్రాంతాల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు పట్టు
అభ్యంతరం చెప్పిన జేసీపై బదిలీ వేటు
తాజాగా కలెక్టర్‌పై ఒత్తిడి చేసేది లేక పునఃపరిశీలన పేరిట అంగీకారం
దరఖాస్తుదారుడి నుంచి రూ. 50 వేల నుంచి లక్ష వసూళ్లు
కోట్లు దండుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు
అభ్యంతరకర భూముల్లో ఉన్న కట్టడాలను కూడా క్రమబద్ధీకరించేస్తామంటూ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఏడాదిగా దండుకుంటూనే ఉన్నారు. వారితో దగ్గరుండి దరఖాస్తు చేరుుంచడమే కాదు ఒక్కొక్కరి నుంచి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారు. అరుుతే క్షేత్ర స్థారుు సర్వేలో అభ్యంతరకర భూముల్లో ఉన్న వాటిని తిరస్కరించారు. ఇందుకు అడ్డు చెప్పిన జేసీ జె.నివాస్‌ను ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చి బదిలీ చేరుుంచారు. ఇప్పుడు కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చి తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులు మళ్లీ వాటిపై అప్పీలు చేసుకునేలా ఆదేశాలు జారీ చేరుుంచారు. ఇదే అదునుగా మళ్లీ వీరి నుంచి వసూళ్ల దందా మొదలెట్టేశారు. సాక్షి, విశాఖపట్నం : అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో వంద గజాల్లోపు ఆక్రమణలను క్రమబద్ధీకరించాలని గతేడాది ఆగస్టు 14న జీవో నెం. 296 జారీ చేశారు. కానీ నగరంలో మూడొంతులు ఎండోమెంట్, గెడ్డలు, కొండవాలు ప్రాంతాలను ఆక్రమించుకుని కట్టినవే. ఇందులో అత్యధికంగా రాజకీయ నాయకులవి కాగా ఇంకొందరు నేతల అండదండలతో ఆక్రమించుకుని బహుళ అంతస్తులు నిర్మించేసుకున్నారు. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తమ అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించుకోవాలని పథక రచన చేశారు.
వీటిలో ఎక్కువగా కొండవాలు ప్రాంతాల్లో క్రమబద్ధీకరించేందుకు కాదు కదా.. కనీసం నివాసం ఉండేందుకు కూడా వీల్లేని నివాసాలే ఉన్నారుు. అరుుతే వీరి నుంచే ఎమ్మెల్యేలు వారి అనుచరులు భారీగా డబ్బులు వసూలు చేశారు. ఈ దరఖాస్తులన్ని తిరస్కరణకు గురికావడంతో వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యారుు. ఏదో విధంగా వీటిని తిరిగి జాబితాలో చేర్చాలని ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా జిల్లా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. జేసీ జె.నివాస్‌పై ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి కూడా చెప్పించి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల స్వీకరణ, సర్వే, పరిశీలన జరిపి తిరస్కరించినందున తిరిగి జాబితాలో చేర్చడం కుదరదని జేసీ కుండబద్దలు కొట్టారు. అందరూ ఊహించినట్టుగా రేషన్ షాపు డీలర్‌షిప్‌ల విషయంలో తమ మాట చెల్లుబాటు కాకపోవడం వల్ల జేసీపై గరంగరంగా ఉన్నట్టుగా కలర్ ఇచ్చినప్పటికీ, అసలు కథ మాత్రం ఈ అక్రమబద్ధీకరణ విషయంలో తమ మాట చెల్లుబాటు కాలేదని తిరుగుబాటు చేశారు. మంత్రులు కూడా చేతులు కలపడంతో జేసీని బలవంతంగా సాగనంప గలిగారు. జేసీని బదిలీ చేయడంతో ఇప్పుడు జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
అప్పీలకు అవకాశం
స్మార్ట్ సిటీ సదస్సు కోసం అమెరికా వెళ్లే హడావుడిలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలంతా కలెక్టర్‌తో భేటీ అయ్యారు. ఆయన కూడా జేసీ బాటలోనే ఎమ్మెల్యేలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినలేదు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల నుంచి ఫోన్లు చేరుుంచి మరీ కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. ‘ఇప్పటివరకు మీరు తిరస్కరించిన వాటిని పునఃపరిశీలించాలని, వారిలో మా కార్యకర్తలు ఉన్నారని, మేము ఇచ్చే జాబితాల ప్రకారమే క్రమబద్ధీకరణ పట్టాలివ్వాలని’ అంటూ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో చేసేది లేక పునః పరిశీలన పేరిట మళ్లీ ఆన్‌లైన్ ద్వారాలు తెరిపించారు. తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులు మళ్లీ వాటిపై అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు.