మలిన శుద్ధితో మంచి ఆరోగ్యం | good health with colon therapy | Sakshi
Sakshi News home page

మలిన శుద్ధితో మంచి ఆరోగ్యం

Published Fri, Sep 5 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

మలిన శుద్ధితో మంచి ఆరోగ్యం

మలిన శుద్ధితో మంచి ఆరోగ్యం

కోలాన్ థెరపీతో

మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ట్రిక్.... ఈ సమస్యలు మనిషిని నిద్ర పోనివ్వవు. బిజీ లైఫ్ స్టైల్‌లో ఇవి చాలా మందిని ఇబ్బందులు పెడుతున్నాయి. సకాలంలో సరైన వైద్యం అందకపోతే ఇవి మీ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. పెద్దపేగులో  పేరుకుపోయిన  మాలిన్యాలను కొలాన్  ఏడఛీట్టౌజ్ఛిట్చఞడ ద్వారా తొలగించవచ్చు. ఈ ట్రీట్‌మెంట్‌లో ఎలాంటి కాలుష్యం లేని పరిశుభ్రమైన డిస్టిల్డ్ వాటర్‌ను 37 డిగ్రీల ఉష్ణోగ్రతకు యంత్రమే వేడి చేసుకుంటుంది.
 
ఈ నీటిని మలమార్గం (రెక్టమ్) ద్వారా పంపడానికి అమెరికా మందుల నియంత్రణ సంస్థ (ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్) ఎఫ్‌డీఏ ఆమోదం పంపిన సంస్థలు తయారు చేసిన ప్రత్యేక నాజిల్‌ను ఉపయోగిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ నాజిల్‌ను ఒకసారి మాత్రమే ఉపయోగిస్తారు. మలమార్గంలోకి నాజిల్ ప్రవేశపెట్టే సమయంలో ఎలాంటి నొప్పి ఉండదు. నాజిల్ ద్వారా లోపలికి గోరువెచ్చని నీరు ప్రవహిస్తుంది. లోపలికి వెళ్ళిన నీరు పెద్దపేగులోని మాలిన్యాలను శుభ్రం చేస్తుంది. మాలిన్యాలు వెళ్ళిపోవడాన్ని  యంత్రానికి ఉన్న ఆధునిక పైపుల ద్వారా స్పష్టంగా చూడవచ్చు.
 
కొలాన్ హైడ్రోథెరపీతో మేలు...
ఇది చాలా సురక్షితమైన ప్రక్రియ. దీని ద్వారా మలబద్ధకం సమస్య దూరమైపోతుంది. పెద్దపేగులో మలం పేరుకుపోవడం వల్ల విషపదార్థాలు వెలువడుతాయి.  కొలాన్ హైడ్రో థెరపీతో మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంతో పాటు ఆరోగ్యం కలుగుతుంది.  ఇప్పుడిది హైదరాబాద్‌లో కూడా అందుబాటులో వచ్చింది.
 
ప్రయోజనాలు
మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడి, ఉద్రిక్తతలు తగ్గుతాయి. విషపదార్థాలు తొలగటం వల్ల పెద్దప్రేగు క్రమాంకుచక కదలికలు మెరుగుపడతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది.
 
సంపూర్ణ ఆరోగ్యం
కొలాన్ హైడ్రో థెరపీ పెద్దపేగు ఆరోగ్యాన్ని  పెంచడంతోపాటు శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది.  యూఎస్‌ఎ, కెనడా, జర్మనీ దేశాలలో ఈ చికిత్స అత్యంత ప్రాచుర్యం పొందింది. ప్రక్రియ చేసేముందు మెడికల్ ఎసెస్‌మెంట్ తప్పనిసరి.
 
చికిత్సలో భాగంగా ప్రత్యేక ప్యాకేజీ 5 సార్లు తీసుకొని వాటితోపాటు, కావలసిన మందులు, ఈజ్ఛ్టీ అఛీఠిజీట్ఛ కూడా ఇస్తారు.
 
వీరికి పనికిరాదు
గర్భవతులు, పెద్దపేగు, మలద్వార కేన్సర్‌తో బాధపడేవారు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ట్రబుల్, అల్సరేటివ్ కొలైటిస్ బాధితులు, పైల్స్ ఉన్నవారికి ఈ చికిత్స పనికిరాదు.
 
ఆహారంలో ఎక్కువగా పీచుపదార్థాలు తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఇందుకోసం ఆకుకూరల లాంటివి బాగా ఉపయోగపడతాయి. మొక్కల్లోని కణకవచంలో ఉండే సెల్యులోజ్‌ను మనం జీర్ణం చేసుకోలేము. ఇది ఎక్కువ నీటిని పట్టి ఉంచుతుంది. అందువల్ల పీచు అధికంగా ఉండే శాకాహారం వల్ల మలవిసర్జన సులభమవుతుంది.
 
మలవిసర్జన తరువాత కూడా ఇంకా మిగిలే ఉన్నట్లు అనిపించి, ప్రయత్నం చేస్తుంటారు కొందరు కాని పూర్తిగా ఖాళీ అవడం అంటూ జరగదు. దీనివల్ల పైల్స్,  ఫిషర్స్ లాంటి సమస్యలు రావడం తప్పించి, ఉపయోగం ఉండదు. పీచుపదార్ధాలు, నీరు అధికంగా తీసుకోవడమే ఈ సమస్యలకు చక్కని నివారణోపాయం.
 
అడ్రస్
శుద్ధ్ కోలన్ కేర్, మర్చంట్ టవర్స్, జీవికే వన్ ఎంట్రీ గేట్ ఎదురుగా, రోడ్ నం. 4, బంజారాహిల్స్, హైదరాబాద్.
వివరాలకు: 800 800 2032, 800 800 2033
మెయిల్ ఐడీ: info@shuddhcoloncare.com
వెబ్‌సైట్: www.shuddhcoloncare.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement