Joint pain
-
ఆర్థరైటిస్ నివారణకు తేలిక మార్గాలు
ఒక వయసు దాటాక ఎముకలు అరిగిపోవడం సహజం. పైగా వయసు పెరుగుతున్న కొద్దీ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు మరీ ఎక్కువ. ఇలా ఎముకలు అరిగిపోవడం వల్ల వచ్చే ఆర్థరైటిస్ సమస్యను కొన్ని సాధారణ జాగ్రత్తల ద్వారా నివారించుకోవచ్చు. అవేమిటో తెలుసుకోండి. చాలాకాలం పాటు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ►స్థూలకాయం వల్ల మీ ఒంటి బరువు ఎముకలపై పడి ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. ►మన శరీర కదలికలు చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. కూర్చుని చేసే వృత్తుల్లో ఉండేవారు వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజూ 30 నిమిషాలు వేగంగా నడవడం వంటి వ్యాయామాలు చేయాలి. ►మరీ ఎక్కువగా కీళ్లు అరిగే అవకాశం ఉన్నవారు కీళ్లకు తగినంత విశ్రాంతి కల్పించాలి. వేగంగా పరుగెత్తే తరహా వ్యాయామాలు చేసేవారు తమ స్పోర్టింగ్ యాక్టివిటీస్‌ను తగ్గించాలి. దానికి బదులు వేగంగా నడవడం మంచిది. తమ ఒంటి బరువును గణనీయంగా తగ్గించే ఈదడం (స్విమ్మింగ్ ఎక్సర్సైజ్) ఇంకా మంచిది. ►కాళ్లు మడిచి, బాసిపట్లు వేసి కూర్చోవడం (స్క్వాటింగ్) మంచిది కాదు. వీలైనంత వరకు కుర్చీ లేదా బల్ల వంటి వాటి మీద కూర్చోవాలి. ►పాల వంటి క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ►మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ►కీళ్లలో నొప్పి కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. -
రుమటాయి ఆర్థరైటిస్ నయమవుతుందా?
నా వయసు 59 ఏళ్లు. నాకు రెండు చేతుల జాయింట్లు (కీళ్లు) నొప్పిగా ఉండటం, కీళ్లవద్ద ఎర్రగా మారాయి. నాకు తగిన సలహా ఇవ్వండి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే తన వ్యాధి నిరోధక శక్తే తనపట్ల ప్రతికూలంగా పనిచేయడం. సాధారణంగా యాభైఏళ్లు పైబడిన వాళ్లలో ఈ నొప్పులు మొదలవుతాయి.ఈ వ్యాధి ఉన్న వారిలో లక్షణాల తీవ్రతలో చాలా రకాల మార్పులు కన్పిపిస్తుంటాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్లు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్లలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్యపరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ యానల్ ఫిషర్ సమస్యకు చికిత్స ఉందా? నా వయసు 39 ఏళ్లు. నేను గత కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, మంట, మలంలో రక్తం కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదించాను. కొన్ని పరీక్షలు నిర్వహించి యానల్ ఫిషర్స్ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. హోమియో మందులతో నాకు పూర్తిగా నయం అవుతుందా? దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఈ యానల్ ఫిషర్స్ బారిన పడే అవకాశం ఎక్కువ. ఇటీవలి కాలంలో ఉన్న పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వంటి అంశాలు జీర్ణవ్యవస్థౖపై ప్రభావం చూపి పైల్స్, ఫిషర్స్, ఫిస్టుల వంటి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వీటిల్లో ఫిషర్ అంటే ఏమిటో తెలుసుకుం దాం. మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఈ ప్రాం తంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల ఇది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన తర్వాత గానీ తీవ్రమైన నొప్పిని, రక్తస్రావాన్ని కలగజేస్తుంది. ►కారణాలు : దీర్ఘకాలిక మలబద్దకం, తరచూ విరేచనాలు, పేగులకు ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధులు (ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్), ప్రసవ సమయంలో పెద్దపేగు చివరి భాగం... పురీషనాళానికి (రెక్టమ్‌కు) రక్తప్రసరణ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది. ►చికిత్స : జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా ఫిషర్స్ సమస్యను హోమియో మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. సంపూర్ణంగా చికిత్స అందించడం ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే వాటిని తగ్గించి, అవి మళ్లీ తిరగబెట్టకుండా చేయవచ్చు. మీరు అనుభవజ్ఞులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ లక్షణాలను వివరించి తగిన చికిత్స తీసుకోండి. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ సయాటికా నొప్పి తగ్గుతుందా? నా వయసు 40 ఏళ్లు. నేను వృత్తిరీత్యా రోజూ దాదాపు 70 కి.మీ. బైక్ మీద తిరుగుతుంటాను. ఈమధ్య నడుము నొప్పి ఎక్కువైంది. ఒకవైపు కాలి నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్లను కలిస్తే నా సమస్య ‘సయాటికా’ అని అంటున్నారు. దయచేసి దీనికి తగిన పరిష్కారం సూచించండి. నేటి జీవనశైలితో వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది సయాటికా. శరీరంలోని నరాలన్నింటిలోనూ పొడవైనది సయాటికా. ఇది వీపు కింది భాగం నుంచి పాదాల వరకు ప్రయాణం చేస్తుంది. ఈ నరంపై ఒత్తిడి కలిగినప్పుడు వచ్చే నొప్పిని సయాటికా నొప్పి అంటారు. ఈ నొప్పి భరింపరానిదిగా ఉండటమే గాక రోజువారీ వ్యవహారాల్లోనూ ఆటంకం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ సమస్యతో తమ విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. ముఖ్యంగా 30 – 50 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాదాపు 90 శాతం మంది ప్రజల్లో జీవితకాలంలో ఏదో ఒకసారి ఇది కనిపిస్తుంది. ►కారణాలు : ∙ఎముకల్లో ఏర్పడే ఒత్తిడి వల్ల వెన్నుపాము నుంచి వచ్చే నరాలు కంప్రెస్ అవుతాయి. దెబ్బలు తగిలినప్పుడు పైరిఫార్మిస్ అనే కండరం వాచి, అది నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. గర్భిణుల్లో పిండం బరువు పెరిగి నరాలపై ఒత్తిడి కలిగిస్తుంది. ∙శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం వల్ల కీలు సక్రమంగా పనిచేయక సయాటికా నొప్పి కలగవచ్చు. ►లక్షణాలు : కాళ్లలో నొప్పి సూదులు గుచ్చినట్లుగా ఉండటం ∙కండరాల బలహీనత, స్పర్శ కోల్పోవడం రెండు కాళ్లలో లేదా ఒక కాలిలో తీవ్రమైన నొప్పి ∙బరువులు ఎత్తినప్పుడు, దగ్గినప్పుడు లేదా అధికశ్రమ కలిగినప్పుడు నొప్పి మరింత పెరగడం. ►నిర్ధారణ పరీక్షలు : ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై. ►చికిత్స : సయాటికా నొప్పికి, వెన్నుపూసల్లో సమస్యలకు హోమియోలో మంచి చికిత్స ఉంది. రస్టాక్స్, కోలోసింథ్, కాస్టికమ్, సిమిసిఫ్యూగా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే సయాటికా నొప్పి పూర్తిగా నయమవుతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
కీళ్ల నొప్పులకు వింత చికిత్స
మొదటి ప్రపంచ యుద్ధానికి కొన్నాళ్ల ముందు కీళ్ల నొప్పుల సమస్యకు ఒక వింత చికిత్స ప్రచారంలోకి వచ్చింది. తిమింగలం మీద కాసేపు పడుకుంటే కీళ్ల నొప్పులు మటుమాయమవుతాయని ఒక ఆస్ట్రేలియన్ ‘అనుభవజ్ఞుడు’ బలంగా చెప్పడంతో ఈ విషయం పత్రికలకెక్కింది. సముద్రాల్లో సంచరించే సజీవ తిమింగలాల మీద శయనించడం ఎటూ సాధ్యం కాదు. అదృష్టం బాగుండి ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలం కళేబరం ఏదైనా కనిపిస్తే, దాన్నలా వృథాగా వదిలేయక కీళ్లనొప్పులతో బాధపడే వారు దాని మీద పడుకుని కాసేపు చిన్న కునుకు తీస్తే నొప్పులన్నీ ఇట్టే నయమైపోతాయని అప్పటి జనాలు కూడా అమాయకంగా నమ్మేవారు. ఇదంతా ఎలా ప్రచారంలోకి వచ్చిందంటే, 1896 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో సముద్రపు ఒడ్డున ఒక నడివయస్కుడు తప్పతాగాడు. తాగినది తలకెక్కాక ఇంటికి వెళదామనుకుని లేచి బయలుదేరాడు. తడబడుతున్న అడుగులతో కొంతదూరం నడిచాక ఇక ముందుకు సాగలేక తెలివితప్పి కుప్పకూలిపోయాడు. ఇసుక మీద కాదు, ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఒక తిమింగలం కళేబరం మీద. తెలివిలోకి వచ్చి చూసుకుంటే అతడు తిమింగలం మీద ఉన్నాడు. అతడికి ఒళ్లంతా తేలిగ్గా అనిపించింది. అంతవరకు పీడించిన కీళ్లనొప్పులు మాయమయ్యాయి. ఇదే సంగతి అతగాడు తన సన్నిహితులకు చెప్పడంతో ఆ సంగతి ఆనోటా ఈనోటా పత్రికలకు చేరింది. ఇక అప్పటి నుంచి కీళ్లనొప్పులతో బాధపడేవారు తిమింగలాల కళేబరాల కోసం సముద్రపు ఒడ్డున ఒకటే అన్వేషణ సాగించేవారు. అయితే, ఇందులో ఎలాంటి శాస్త్రీయతా లేదన్నది ఆధునిక వైద్యుల మాట. -
కలవరపరిచే కీళ్లనొప్పి... రుమటాయిడ్ ఆర్థరైటిస్
నాకు కీళ్లలో విపరీతమైన నొప్పిగా ఉంది. కీళ్ల కదలికలు చాలా కష్టంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఉదయం వేళలో ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంది. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? దయచేసి వివరంగా చెప్పండి. – ఎల్. నిరంజన్‌రావు, మధిర మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే మన శరీర భద్రతావ్యవస్థ మనపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వస్తుంది. ఈ వ్యాధి చిన్న ఎముకలు, కీళ్లు, మెడ ఎముకలు వంటి చోట్ల వచ్చే అవకాశం ఉంది. కీళ్ల చుట్టూ ఉండే పొరలో వాపు వచ్చి అక్కడి కణాలు పెద్దగా మారి, అక్కడ స్రవించే ద్రవపదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల ఎముకలు దెబ్బతిని, కీళ్లు బిగపట్టినట్లు అవుతుంది. దాంతో కదలికలు కష్టంగా మారతాయి. లక్షణాలు ⇔ కీళ్ల వాపు, నొప్పి, కదలికలు కష్టంగా మారతాయి. ⇔ ఉదయం లేచిన వెంటనే కీళ్లు బిగబట్టినట్లుగా ఉండి, నొప్పి ఎక్కువగా వస్తుంది. ⇔ కీళ్లు దెబ్బతినడం వల్ల చేతి వేళ్లు కొంకరపోవడం, స్వాన్నెక్ డిఫార్మిటీ, జడ్ థంబ్ డిఫార్మిటీ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ⇔ మడమ, చేతి ఎముకలపై చిన్న గడ్డలు రావచ్చు. ⇔ నీరసం, అలసట, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇతర లక్షణాలు ⇔ వ్యాధి తీవ్రస్థాయికి చేరినప్పుడు కీళ్లనే కాకుండా ఊపిరితిత్తుల్లో నీరు పట్టడం, ఊపిరితిత్తులు గట్టిపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ⇔ మూత్రపిండంలోని నెఫ్రాన్స్ పొరలు వాచి మూత్ర సమస్యలు రావచ్చు. ⇔ గుండె పొరల వాపు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, గుండెపోటు వంటి సమస్యలు రావచ్చు. ⇔ కంటి పొరల వాపు, కాలేయం వాపు, రక్తహీనత, నరాల సమస్యల వంటివి వచ్చే అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు ∙రక్తపరీక్షలు (సీబీపీ), ఈఎస్ఆర్ ∙ఎమ్మారై జాయింట్స్ lకీళ్ల ఎక్స్–రే (దీనితో వ్యాధి తీవ్రతను తెలుసుకోవచ్చు) lరుమటాయిడ్ ఫ్యాక్టర్ ∙క్రియాటివ్ ప్రోటీన్ ∙రీనల్ ఫంక్షన్ టెస్ట్ ∙లివర్ ఫంక్షన్ టెస్ట్ ∙ఏసీపీఏ టెస్ట్‌తో మన శరీరంలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలను తెలుసుకోవచ్చు. హోమియో చికిత్స ఈ సమస్యకు హోమియోలో కాల్సికమ్, ఆర్సినికమ్ ఆల్బమ్, లైకోపోడియమ్, రోడోడెండ్రాన్ వాడదగిన మందులు. అయితే లక్షణాలను బట్టి నేట్రమ్ ఆర్స్, డల్కమెరా, క్యాలి అయోడ్, నేట్రమ్మూర్, ఆసిడ్ బెంజ్, రూస్టాక్స్ వంటి మందులు కూడా ఉపశమనానికి బాగా ఉపయోగపడతాయి. నిద్రలో కాళ్లు కదులుతున్నాయి... ఎందుకిలా? నా భార్య వయసు 49 ఏళ్లు. డయాబెటిస్తో బాధపడుతోంది. ఇటీవల నిద్రలో ఆమె కాళ్లను చాలా వేగంగా కదిలిస్తోంది. నిద్రలోంచి లేచి పిక్కలు పట్టేస్తున్నాయని (మజిల్ క్రాంప్స్) అంటోంది. దీంతో ఆమె నిద్రకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దయచేసి ఆమె విషయంలో తగిన సలహా ఇవ్వండి. – రామానుజరావు, వరంగల్ నిద్రలో ఇలా కుదుపుతున్నట్లుగా కాళ్లు వేగంగా కదిలించడాన్ని ‘పీరియాడిక్ లింబ్ మూవ్మెంట్ డిజార్డర్’ (పీఎల్‌ఎమ్‌డీ) అంటారు. సాధారణంగా నిద్రపోతున్న సమయంలో మన శరీరంలో శ్వాస తప్ప మరే కదలికా ఉండదు. కానీ నిద్రజబ్బులో ఇలా కదలికలు కనిపించే జబ్బు ఇదే. ఇక్కడ ‘పీరియాడిక్’ అనే పదం కదలికలు ఎంత ఫ్రీక్వెన్సీతో వస్తున్నాయనేందుకు ఉపయోగిస్తారు. ఇవి క్రమబద్ధంగా ప్రతి 20 – 40 సెకండ్ల పాటు వస్తుంటాయి. పీఎల్‌ఎమ్‌డీ అనేది నిద్రకు సంబంధించిన వ్యాధి. దీనితో బాధపడేవారు రాత్రివేళ నిద్ర తక్కువ కావడం వల్ల పగలు మగతగా ఉంటారు. పీఎల్‌ఎమ్‌డీ అనేది ఏ వయసు వారిలోనైనా రావచ్చు. అయితే సాధారణంగా మధ్యవయస్కుల్లో ఇది ఎక్కువ. పీఎల్ఎమ్డీలో ప్రైమరీ, సెకండరీ అని రెండు రకాలున్నాయి. సెకండరీ పీఎల్‌ఎమ్‌డీ అనేది అంతర్గతంగా ఇతర వ్యాధులు ఉన్నవారిలో కనిపిస్తుంది. లేదా కొందరిలో దీనికి కారణం కూడా తెలియదు. మెదడు నుంచి కాళ్లు, చేతులకు వెళ్లే నరాల్లో సమస్యల వల్ల ఇది వస్తుందని తెలుసుకానీ, ఆ సమస్యలేమిటో ఇంకా పరిశోధనల్లో వెల్లడికాలేదు. సెకండరీ పీఎల్ఎమ్డీకి చాలా కారణాలు ఉన్నాయి. అవి... ∙డయాబెటిస్ ∙ఐరన్ లోపం lవెన్నెముకలో కణుతులు ∙వెన్నెముక దెబ్బతినడం lస్లీప్ ఆప్నియా (గురక) lనార్కోలెప్సీ (క్రమమైన వేళల్లో నిద్రపట్టడం, నిద్రలేవడం జరగకపోవడం) lయురేమియా (రక్తంలో యురియా, నైట్రోజన్ సంబంధిత వ్యర్థపదార్థాల పాళ్లు పెరగడం), రక్తహీనత మొదలైనవి. పీఎల్ఎమ్డీతో బాధపడే చాలామందిలో కాళ్ల కదలికలు లేకుండా నిద్రపట్టకపోవడం, దాంతో పగటినిద్ర ఎక్కువగా ఉంటాయి. కొందరిలో ఒక కాలు, లేదా మరికొందరిలో రెండుకాళ్లూ కదులుతూ ఉండవచ్చు. దీని నిర్ధారణకు నిర్దిష్టంగా పరీక్షలేవీ లేకపోయినా, రక్తహీనత వంటి వాటి ద్వారా కారణాన్ని ఊహించవచ్చు. ఈ సమస్య ఉన్నవారికి బెంజోడయజిపైన్స్, క్లోనోజెపామ్, డోమమినెర్జిక్ ఏజెంట్స్, యాంటీ కన్వల్జెంట్ ఏజెంట్స్, గాబా ఆగోనిస్స్ వంటి మందులతో చికిత్స చేయవచ్చు. -
నిద్రలేవగానే కీళ్లనొప్పి...!
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 58 ఏళ్లు. రెండు వారాల నుంచి నేను ఉదయం నిద్రలేచిన వెంటనే నడవడం చాలా కష్టంగా ఉంటోంది. కీళ్లనొప్పి, వాపు, బిగుసుకుపోవడం, కాళ్లలో బలహీనత, మొద్దుబారడం జరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? నాకు తగిన సలహా ఇవ్వండి. - కె. బలరామ్, కొత్తగూడెం మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కీళ్లలోని కార్టిలేజ్ అనే మృదులాస్థి అరుగుదలకు గురికావడం, తద్వారా చుట్టూ ఉన్న కణజాలంపై అరుగుదల ప్రభావం పడటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్‌గా పేర్కొంటారు. ఇది 40 ఏళ్ల వయసు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఇది ఎక్కువ. ఎక్కువగా మోకాలిలో కనిపించే సమస్య అయినప్పటికీ చేతివేళ్లు, వెన్నుపూస, తుంటి ప్రాంతం, కాలివేళ్లలోనూ ఆస్టియో ఆర్థరైటిస్ తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్య సాధారణంగా గతంలో కీళ్లకు ఏదైనా దెబ్బ తగిలి ఉండటం, అధిక బరువు, కాళ్ల ఎదుగుదలలో హెచ్చుతగ్గులు ఉండటం, కీళ్లపై అధిక ఒత్తిడి కలిగించే పనులు చేయడం వంటివి కారణాలు. కొందరిలో వంశపారంపర్యంగానూ ఈ సమస్య కనిపించవచ్చు. మీరు కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపరీక్ష, మోకాలి నుంచి కొద్దిగా ద్రవాన్ని తీసి పరీక్షించడం, ఎక్స్-రే, సీటీ స్కాన్ వంటి పరీక్షల ద్వారా ఈ సమస్యను నిర్ధారణ చేయవచ్చు. మీకు దగ్గర్లోని వైద్య నిపుణులను సంప్రదించండి. - డా. ప్రవీణ్ మేరెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్,కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. నాకు చాలాకాలంగా తలలో, ముఖం మీద, కనురెప్పల దగ్గర చర్మం ఎర్రటి, తెల్లటి పొరలతో దురదగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సెబోరిక్ డర్మటైటిస్ అని చెప్పారు. మందులు వాడితే సమస్య తగ్గుతోంది, కానీ మళ్లీ కొంతకాలానికే తిరగబెడుతోంది. అసలు సమస్య ఎందుకు వస్తోంది? హోమియోలో ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. - పురుషోత్తమరావు, మంచిర్యాల చర్మంలో సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉండే భాగాలు ఎర్రగా మారడంతో పాటు, దురదతో ఈ వ్యాధి కనిపిస్తుంటుంది. సాధారణంగా ఇది దీర్ఘకాలిక సమస్య. ఇది 30 నుంచి 70 ఏళ్ల వారితో పాటు మూడు నెలల శిశువులలోనూ కనిపిస్తుంది. వీళ్లలో 6 నుంచి 12 నెల వయసు వరకు ఇది తగ్గిపోతుంటుంది. తలలో వచ్చే తేలికపాటి సెబోరిక్ డర్మటైటిస్‌ని చుండ్రు అని అంటారు. ఇది ఎక్కువ మందిని వేధించే సమస్య. ఈ వ్యాధి ఎక్కువగా తల, ముఖం, ఛాతీ, వీపు, చెవి లోపలి భాగాలతో పాటు వెంట్రుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కనిపిస్తుంటుంది. కారణాలు : ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ చర్మంలోని సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉన్న చోట మలసేజియా అనే ఒక రకం జీవజాతి అధికంగా అభివృద్ధి చెంది కొన్ని హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ అంశం సెబోరిక్ డర్మటైటిస్‌ను ప్రేరేపిస్తుంది. * రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల్లోనూ, పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ. * మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేవారిలో, జిడ్డు చర్మం ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలు అధికం. * వాతావరణం, హార్మోన్ సమస్యలు, కొన్ని జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధిని ప్రభావితం చేయవచ్చు. లక్షణాలు : సెబోరిక్ డర్మటైటిస్ లక్షణాలు క్రమంగా ఏర్పడతాయి చర్మంపై ఎర్రటి, తెల్లటి లేదా పసుపు వర్ణంలో పొరలు ఏర్పడతాయి. దురద, మంట కనిపిస్తుంటుంది దీని తీవ్రత సాధారణంగా చలికాలంలో ఎక్కవగానూ, వేసవిలో ఒకింత తక్కువగానూ ఉంటుంది. చిన్నపిల్లల్లో : తలపై చర్మం జిడ్డుగా, పొరలుగా, ఎర్రటి దద్దుర్లలా కనిపిస్తాయి. దీనినే ‘క్రెడిల్ క్యాప్’ అని అంటారు. ఇది చంకలకు, గజ్జలకు వ్యాపిస్తుంది. వీళ్లలో దురద ఎక్కువగా ఉండకపోవచ్చు. నిర్ధారణ : వ్యాధి లక్షణాలను బట్టి దీన్ని గుర్తించవచ్చు. ఇది సోరియాసిస్‌ను పోలి ఉంటుంది. కానీ సోరియాసిన్ ముఖాన్ని ప్రభావితం చేయకపోవడం వల్ల ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించవచ్చు. * మీరు ఆందోళన చెందకండి. ఆధునిక జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని సరిచేయడం వల్ల సెబోరిక్ డర్మటైటిస్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్ యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. నేను ఉద్యోగం చేస్తుంటాను. చాలాకాలం నుంచి నాకు వేసవి కాలంలో మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ వస్తోంది. ఈ కాలంలోనే మూత్ర విసర్జన సమయంలో మంట, కొద్దికొద్దిగా రావడం, నొప్పి వంటివి వస్తున్నాయి. ప్రతి ఏటా డాక్టర్‌ను ఇలా సంప్రదించడం, మందులు వాడటం పరిపాటిగా మారింది. ఎందుకిలా జరుగుతోంది. దయచేసి కారణాలు వివరించండి. - రాణి, హైదరాబాద్ మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ రావడానికి ప్రధాన కారణం ‘ఈ-కొలై’ అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా బయట వాతావరణంలోనే ఉంటుంది. ఇది మూత్రవిసర్జన సమయంలో గానీ లేదా సెక్స్ వల్లగాని మూత్రనాళాల్లోకి వెళ్లినప్పుడు కిడ్నీకి సైతం దీనివల్ల అత్యంత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇందులో ‘క్లెబ్సియల్లా, ఇంటరోకోకస్ ఫైకలిస్’ అనే రెండు బ్యాక్టీరియాలు చాలా కీడు చేసేవి. యాంటీబయాటిక్స్ లాంటి మందులకు కూడా ఇవి లొంగవు. ఇటీవలి అధ్యయనాల వల్ల 55 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళల్లో 50 శాతం మంది దీని బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు వేసవిలోనే ఎక్కువ కాబట్టి మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వేసవిలోనే వస్తుంటాయి. సాధారణంగా మంచినీళ్లు ఎక్కువగా తాగని వారు ఈ కాలంలోనూ అదే ధోరణిని కొనసాగిస్తుంటారు. దాంతో కిడ్నీలకు సరైన మంచినీరు అందక అవి శరీర మలినాలను సరిగా శుద్ధి చేయలేవు. ఫలితంగా ఇన్ఫెక్షన్ పెరుకుపోయి మంట పుట్టడం, నొప్పి రావడంతో పాటు కొద్దికొద్దిగా మూత్రం వస్తూ ఇబ్బందులకు గురిచేస్తుంది. దీనికి తోడు శారీరక శ్రమ ఉండటం, పని ఒత్తిడికి లోనై నీళ్లు చాలాసేపు తాగకపోవడం వల్ల మూత్రనాళల్లో ఉన్న మూత్రం అలాగే కొన్ని గంటల పాటు ఉండటంతో బ్యాక్టీరియాకు అవి నివాస కేంద్రాలుగా మారి ఇన్ఫెక్షన్కు కారణమవుతుంటాయి. మూత్ర సంబంధిత సమస్యలను సాధారణంగా వైద్యులు మందులతోనే తగ్గిస్తుంటారు. మీరు మరోసారి మీ డాక్టర్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. - డా.ఎ.సూరిబాబు -
బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 42. గత కొంతకాలంగా నా మోకాళ్లు తీవ్రంగా నొప్పి పెడుతున్నాయి. డాక్టర్‌ను కలిస్తే కొన్ని పరీక్షలు చేయించి, నాకు ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పి, మందులు రాశారు. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏమిటి? దీనికి హోమియోలో మందులు ఉన్నాయా? - కె.ఎస్.ఆర్. హైదరాబాద్ మన శరీరంలో ఉండే అన్ని కీళల్లో ప్రధానమైనవి మోకాలి జాయింట్లు. ఇవి నడవడానికి, పరుగెత్తడానికీ, మెట్లెక్కడానికీ, వివిధ కదలికలన్నింటికీ సహాయపడతాయి. తొడ ఎముక (ఫీమర్), దిగువ కాలి ఎముక (టిబియా) రెండూ కలిసి మోకాలి జాయింటుగా ఏర్పడి ఉంటాయి. ఈ రెండు ఎముకల చివరి భాగాలు కలిసిన ప్రాంతంలో కార్టిలేజ్ అనే నున్నటి మృదులాస్థి ఉండి, ఇవి మృదువుగా కదలడానికి సహాయపడుతుంది. మోకాలి జాయింటును చుడుతూ సైకోవియం అనే పొర ఉంటుంది. ఈ పొర సైకోవియల్ ఫ్లూయిడ్ అనే ద్రవాన్ని విడుదల చేస్తుంటుంది. ఈ సైకోనియం పొరపై క్యాప్సూల్ అనే మరో గట్టిపొర ఉంటుంది. ఇది మోకాలి జాయింటును స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ ఎలా వస్తుందంటే..? ఆర్థరైటిస్ మొదలైన కొన్ని రోజులకు కార్టిలేజ్ క్రమంగా అరిగిపోవటం ఆరంభమవుతుంది. దీంతో క్రమేపీ అది పలుచగా మారుతుంది. దీనికితోడు ఎముకలలో కణజాలం వాపునకు గురై ఎముకల చివరి భాగాలు పెరిగి పోవడంతో ఇది ఆస్టియో ఫైట్స్గా మారిపోతాయి. దీని ప్రభావంతో సైకోనియం పొర ఉబ్బి అదనపు ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఫలితంగా మోకాలి కీలులో వాపు, మోకాలిలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇది మోకాళ్లలోనే కాకుండా చేతి వేళ్లు, వెన్నుపూస, తుంటి, కాలివేళ్లు మొద లైన చోట్ల కూడా కనిపించవచ్చు. కారణాలు: 40 సంవత్సరాలు దాటిన వారిలో ముఖ్యంగా స్త్రీలలో ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఊబకాయం, వంశపారంపర్య చరిత్ర తదితర కారణాల వల్ల, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాథమిక దశలో ఉన్న వారికి కూడా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: కీళ్లనొప్పి, వాపు, బిగుసుకుపోవడంతోపాటు ఉదయం నిద్రలేచిన వెంటనే నడవడం చాలా కష్టంగా ఉంటుంది. వీటికి తోడు కీళ్ల దగ్గర రాపిడి శబ్దాలు, చేతితో ఆ ప్రాంతాన్ని తాకిన ప్పుడు వేడిగా అనిపించడం, కింద కూర్చున్నప్పుడు తీవ్రమైన ఇబ్బంది, ఈ నొప్పి మూలాన నడిచే తీరులో సైతం తేడా వస్తుంది. నిర్థారణ: రోగలక్షణాలను బట్టి, రక్తపరీక్ష, మోకాలి నుండి నీరు తీసి పరీక్ష చేయడం ద్వారా, ఎక్స్‌రే, ఎమ్మారై, సీటీ స్కాన్... హోమియో చికిత్స: హోమియో కేర్ ఇంటర్నేషనల్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానంలో ఆస్టియో ఆర్థరైటిస్‌ను తగ్గించడంలోనూ, కీళ్ల కదలికలను సురక్షితంగా ఉంచడంలోనూ సత్ఫలితాలను సాధిస్తూ వస్తోంది. రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని ప్రభావవంతమైన చికిత్స ఇవ్వడం ద్వారా వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 22 ఏళ్లు. నాకు కొంత కాలం క్రితం కాళ్లలో వాపులు రావడం, తరచూ వాంతులు అవుతుండటంతో వైద్యులను సంప్రదించాను. వైద్యపరీక్షలు చేసి, నాకు క్రానిక్ కిడ్నీ సమస్య ఉన్నట్లు నిర్ధారణ చేశారు. వెంటనే డయాలసిస్ ప్రారంభించారు. గత మూడు నెలలుగా వారానికి మూడుసార్లు డయాలసిస్ చేస్తున్నారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఉత్తమమని వైద్యులు చెప్పారు. నా బ్లడ్‌గ్రూపు ఓ పాజిటివ్. మా కుటుంబంలో ఎవరికీ ఆ బ్లడ్ గ్రూపు లేదు. బ్లడ్‌గ్రూపు కలవకపోతే కిడ్నీ మార్పిడి చేయించుకునే అవకాశం ఉంటుందా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - ఎస్.వి.ఆర్. హైదరాబాద్ కిడ్నీ దాత, స్వీకర్త ఒకే బ్లడ్ గ్రూపు కలిగి ఉంటే కిడ్నీ మార్పిడి చేయవచ్చు. అయితే ఇటీవల అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దాత, స్వీకర్తల బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయడం వీలువుతుంది. ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే ఆధునిక వైద్య ప్రక్రియ ద్వారా బ్లడ్‌గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయవచ్చు. ఈ ప్రక్రియలో వేర్వేరు బ్లడ్‌గ్రూపుల్లోని యాంటిజెన్‌ను కలిసేలా చేస్తారు. ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిష్ణాతులైన వైద్యులు, అధునాతన సదుపాయాలు అందుబాటులో ఉన్న ఆసుపత్రుల్లోనే చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా చేసిన కిడ్నీ మార్పిడి కూడా మామూలుగా బ్లడ్ గ్రూప్‌లు కలిసినప్పుడు నిర్వహించే శస్త్రచికిత్సల్లాగా మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయి. మీలాగా బ్లడ్‌గ్రూపులు కలవకపోవడం వల్ల కిడ్నీ మార్పిడి చేయించుకోలేక దీర్ఘకాలికంగా డయాలసిస్‌పైనే ఆధారపడుతున్న ఎంతోమందికి ఏబీఓ ఇన్కాంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. డాక్టర్ ఊర్మిళ ఆనంద్ సీనియర్ నెఫ్రాలజిస్ట్, యశోద హస్పిటల్స్, సికింద్రాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాప వయసు ఎనిమిదేళ్లు. చాలాకాలంగా ఆయాసం, దగ్గుతో బాధపడుతోంది. ఏమీ తినలేకపోతుంది. కొద్దిగా కారం తిన్నా కడుపులో మంట అని ఏడుస్తోంది. డాక్టర్‌ను కలిశాం. మందులు వాడుతున్నా ఇంకా దగ్గు వస్తూనే ఉంది. మా పాప సమస్య పూర్తిగా తగ్గడానికి ఏం చేయాలో తెలియజేయండి. - పవన్, విజయవాడ మీ పాపకు సాధారణ ఆస్తమాతో పాటు దాని అనుబంధ సమస్యగా యాసిడ్ పెప్టిక్ డిసీజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కడుపునొప్పి (ముఖ్యంగా రాత్రిపూట), వికారం (నాసియా), బరువు సరిగా పెరగకపోవడం వంటి లక్షణాలు యాసిడ్ పెప్టిక్ డిసీజ్‌లో ఉంటాయి. ఇక మీ పాపకు ఉన్న మొదటి సమస్య ఆస్తమా ఇటీవల చాలామందిలో కనిపిస్తోంది. దాదాపు 20 శాతం నుంచి 25శాతం మందిలో ఆస్తమాకు - యాసిడ్ పెప్టిక్ డిసీజ్ (ఏపీడీ/జీఈఆర్) తోడవుతున్నట్లు చాలా అధ్యయనాల వల్ల తెలుస్తోంది. ఇలాంటి పిల్లల్లో భోజనం తర్వాత దగ్గు పెరుగుతుంటుంది. రాత్రివేళ దగ్గు, ఆయాసం వంటి లక్షణాలతో పాటు రిఫ్లక్స్ (తిన్న ఆహారం వెనక్కు రావడం) వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో మానసిక ఒత్తిడి కడుపులోని యాసిడ్ స్రావాలను పెంచుతుంది. కొన్ని రకాల డ్రగ్స్, ఆహారాలు, ఇన్ఫెక్షన్స్, ఆటో ఇమ్యూన్ వ్యాధుల వల్ల పొట్ట, పేగులలో అల్సర్స్ వచ్చే అవకావం ఉంది. కొన్నిసార్లు ఆస్తమా చికిత్సకు వాడే కొన్ని మందుల వల్ల కూడా రిఫ్లక్స్ పెరిగి పేగుకు సంబంధించిన లక్షణాలు ఎక్కువ కావడం జరుగుతుంటుంది. మీ పాపకు పూర్తిస్థాయి ఆస్తమా చికిత్స అవసరం. దాంతోపాటు అసిడిటీతో, గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్‌కు సంబంధించిన మందులు వాడటం ముఖ్యం. ఆహారంలో అసిడిటీని కలిగించే కాఫీ, పుల్లని పండ్లు, మసాలాలు నివారించడం అవసరం. నిద్ర పోవడానికీ, భోజనానికీ మధ్య కనీసం మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. పడుకునే సమయంలో మిగతా శరీరం కంటే తల కాస్త పైన ఉండేలా చూసుకోవాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో పాప లక్షణాలను చాలావరకు తగ్గించవచ్చు. అయితే లక్షణాలు పెరుగుతుంటే మాత్రం ఎండోస్కోపీ చేసి సివియర్ యాసిడ్ పెప్టిక్ డిసీజ్ ఉందా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం. బేరియమ్ స్టడీతో పాటు ఎండోస్కోపిక్ ఇవాల్యుయేషన్ ద్వారా పాప సమస్యలకు కారణాన్ని తెలుసుకోవచ్చు. మీరు మరోసారి మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఆస్టియో ఆర్థరైటిస్
కీళ్లు బలహీనపడటం, అరుగుదల కారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. కీళ్లలో ఉండే కార్టిలేజ్ అనే మృదువైన కుషన్‌లాంటి పదార్థం దెబ్బతినడం వల్ల కీళ్ల మధ్యలో ఉండే గ్యాప్ తగ్గడంతో ఎముకలు ఒకదానితో మరొకటి ఒరుసుకుపోతాయి. దాంతో నొప్పి, స్టిఫ్నెస్ వస్తుంది. ఈ కండిషన్‌కు వయసు కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. కాబట్టి నలభై ఏళ్లు పైబడిన వారిలో ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపిస్తుంది. కొందరిలో ఇది వంశపారంపర్యంగా కనిపిస్తుంది. అంటే ఆ కుటుంబంలో ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే పిల్లలకూ అది వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే బరువు ఎక్కువగా మోసేవారిలో మోకాళ్ల కీళ్లు, వెన్నెముక, తుంటి కీలు ప్రభావితమై ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌కు కారణాలు : అధిక బరువు /స్థూలకాయం కీళ్లపై బలమైన దెబ్బ తగలడం (ట్రామా) కీళ్లను ఎక్కువగా ఉపయోగించేవారిలో (వృత్తిపరంగా) కొన్ని మెటబాలిక్ వ్యాధులు (ఉదా: ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఐరన్ ఉండే హీమోక్రొమటోసిస్, అలాగే ఎక్కువగా కాపర్‌ను కలిగి ఉంటే విల్సన్స్ డిసీజ్ వంటివి) రుమటాయిడ్ ఆర్థరైటిస్ డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉండటం కొన్నిరకాల మందులను ఎక్కువగా వాడటం (ఉదా: కార్టికోస్టెరాయిడ్స్). లక్షణాలు : నొప్పి: కీళ్లలో నొప్పి ఎక్కువగా ఉండటం, కదలికలతో ఈ నొప్పి మరింత ఎక్కువ అవుతుంది స్టిఫ్నెస్ : కీళ్లు బిగుసుకుపోయినట్లుగా ఉండటం. ఫలితంగా కీళ్లలో కదలికలు తగ్గుతుంది కదిలేటప్పుడు శబ్దం: కీళ్లు కదిలినప్పుడు ఒక్కొక్కసారి శబ్దాలు వినిపిస్తాయి. వాపు : కీళ్లలో వాపు రావచ్చు. ప్రత్యేకంగా చేతివేళ్లలో ఉండే కీళ్లలో వాపు రావడం ఎక్కువ. వీటిని హెర్బ్డెన్స్ నోడ్స్, బకార్డ్స్ నోడ్స్ అంటారు వెన్నెముకకు ఈ వ్యాధి వస్తే ఆ రోగుల్లో నడుమునొప్పి, మెడనొప్పి, స్టిఫ్నెస్, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరీక్షలు : కీళ్లకు సంబంధించిన ఎక్స్-రేతో ఈ వ్యాధిని గుర్తించవచ్చు. జాగ్రత్తలు / నివారణ : బరువు తగ్గడం (స్థూలకాయాన్ని తగ్గించుకోవడం) క్యాల్షియం పుష్కలంగా ఉండే పాలు, పాల ఉత్పాదనలకు సంబంధించిన పదార్థాలను తీసుకోవడం విటమిన్-డి లభ్యమయ్యేలా లేత ఎండలో 30 నిమిషాలు నడవటం తగినంత వ్యాయామం చేయడం. చికిత్స : ఈ వ్యాధికి రోగి, అతడి మానసిక / శారీరక లక్షణాల ఆధారంగా కాన్స్టిట్యూషన్ పద్ధతిలో హోమియో మందులు ఇవ్వడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
భయపెడుతున్న జ్వరాలు
ఎ.కొండూరు, న్యూస్‌లైన్ : మండలంలోని రామచంద్రాపురం, చీమలపాడు గ్రామాల్లో జ్వరాలు ప్రబలుతున్నారుు. రామచంద్రాపురం వాటర్ ట్యాంకు రోడ్డులోని ప్రతి ఇంట్లో జ్వర పీడితులు ఉండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జ్వరంతోపాటు కాళ్లు, కీళ్ల నొప్పులు కూడా విపరీతంగా ఉండటంతో యువకులు కూడా మంచాలకే పరిమితమవుతున్నారు. మైలవరం ప్రభుత్వాస్పత్రి వద్ద జ్వరపీడితులు క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు ఒక్క రామచంద్రాపురం నుంచే 300మందికి పైగా జ్వరం బారిన పడినట్లు సమాచారం. కలుషిత నీరు తాగటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గ్రామస్తులు చెబుతున్నారు. చీమలపాడులో పారిశుద్ధ్యలోపం కారణంగా 200మంది జ్వరాల బారిన పడ్డారు. పలువురు చికున్‌గున్యా, విషజ్వరాలతో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. పారిశుద్ధ్య లోపమే కారణమా.. ఈ పరిస్థితికి పారిశుద్ధ్య లోపమే కారణమని చీమలపాడు గ్రామస్తులు వాపోతున్నారు. బీసీ, ఎస్సీ కాలనీల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు విజృంభించి జ్వరాలు వస్తున్నాయని వారు చెబుతున్నారు. గతంలో కూడా విషజ్వరాలు ప్రబలి భయపెట్టాయని, మళ్లీ అదే పరిస్థితి పునరావృత్తమైందంటున్నారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటే ఇలా జరిగేది కాదని, రామచంద్రాపురం బీసీ కాలనీలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, ట్యాంకు నీరు కూడా కలుషితమవుతోందని పేర్కొన్నారు. అధికారులు పట్టించుకోవట్లేదు కొన్ని రోజులుగా గ్రామస్తులు జ్వరాల బారిన పడుతున్నా అధికారులు మావైపు చూడలేదు. జ్వరంతో పాటు కాళ్లు నొప్పులు కూడా వస్తుండటంతో భయంగా ఉంది. దాదాపు ప్రతి కుటుంబంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. - సరస్వతి, రామచంద్రాపురం కలుషిత నీరు తాగటం వల్లే.. రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా అవుతున్న మంచినీటి పైపులు పగిలి కలుషితమవుతున్నారుు. ఈ నీటిని తాగటం వల్లే గ్రామస్తులంతా జ్వరాల బారిన పడుతున్నారు. - వెంకటరెడ్డి, రామచంద్రాపురం