ఎ.కొండూరు, న్యూస్‌లైన్ : మండలంలోని రామచంద్రాపురం, చీమలపాడు గ్రామాల్లో జ్వరాలు ప్రబలుతున్నారుు. రామచంద్రాపురం వాటర్ ట్యాంకు రోడ్డులోని ప్రతి ఇంట్లో జ్వర పీడితులు ఉండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జ్వరంతోపాటు కాళ్లు, కీళ్ల నొప్పులు కూడా విపరీతంగా ఉండటంతో యువకులు కూడా మంచాలకే పరిమితమవుతున్నారు. మైలవరం ప్రభుత్వాస్పత్రి వద్ద జ్వరపీడితులు క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు ఒక్క రామచంద్రాపురం నుంచే 300మందికి పైగా జ్వరం బారిన పడినట్లు సమాచారం. కలుషిత నీరు తాగటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గ్రామస్తులు చెబుతున్నారు. చీమలపాడులో పారిశుద్ధ్యలోపం కారణంగా 200మంది జ్వరాల బారిన పడ్డారు. పలువురు చికున్‌గున్యా, విషజ్వరాలతో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు.
పారిశుద్ధ్య లోపమే కారణమా..
ఈ పరిస్థితికి పారిశుద్ధ్య లోపమే కారణమని చీమలపాడు గ్రామస్తులు వాపోతున్నారు. బీసీ, ఎస్సీ కాలనీల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు విజృంభించి జ్వరాలు వస్తున్నాయని వారు చెబుతున్నారు. గతంలో కూడా విషజ్వరాలు ప్రబలి భయపెట్టాయని, మళ్లీ అదే పరిస్థితి పునరావృత్తమైందంటున్నారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటే ఇలా జరిగేది కాదని, రామచంద్రాపురం బీసీ కాలనీలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, ట్యాంకు నీరు కూడా కలుషితమవుతోందని పేర్కొన్నారు.
అధికారులు పట్టించుకోవట్లేదు
కొన్ని రోజులుగా గ్రామస్తులు జ్వరాల బారిన పడుతున్నా అధికారులు మావైపు చూడలేదు. జ్వరంతో పాటు కాళ్లు నొప్పులు కూడా వస్తుండటంతో భయంగా ఉంది. దాదాపు ప్రతి కుటుంబంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
- సరస్వతి, రామచంద్రాపురం
కలుషిత నీరు తాగటం వల్లే..
రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా అవుతున్న మంచినీటి పైపులు పగిలి కలుషితమవుతున్నారుు. ఈ నీటిని తాగటం వల్లే గ్రామస్తులంతా జ్వరాల బారిన పడుతున్నారు.
- వెంకటరెడ్డి, రామచంద్రాపురం
భయపెడుతున్న జ్వరాలు
Published Sat, Aug 24 2013 12:50 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM
Advertisement