ఆపరేషనే అంతిమ నిర్ణయం కాదు... | Homeopathy treatment for tonsils, sinusitis, piles | Sakshi
Sakshi News home page

ఆపరేషనే అంతిమ నిర్ణయం కాదు...

Published Thu, Oct 31 2013 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM

Homeopathy treatment for tonsils, sinusitis, piles

ఇవాల్టి రోజుల్లో ప్రతి చిన్న వ్యాధికి ఆపరేషన్ చేయించుకోవలసి వస్తోంది. ఉదాహరణకు మొలలు, సైనస్, ముక్కులో కండరం పెరగడం వంటి వాటికి ఆపరేషన్ చేయించుకుంటున్నారు. అయినా ఏం లాభం...రెండు నుంచి మూడు నెలలలోపు మరల అదే వ్యాధి వస్తూంటుంది. కాని హోమియోపతిలో అయితే, రోగి శారీరక, మానసిక స్థితులను  బట్టి మందులు ఇచ్చి, ఆ వ్యాధిని సమూలంగా తొలగించడం ద్వారా మరల మరల రాకుండా చూడవచ్చు.
 
 ఫైల్స్, ఫిస్టుల్యా, పిష్షర్స్

 మలవిసర్జన కష్టతరమైనా, మామూలుగా కాక తక్కువసార్లు మల విసర్జన జరుగుతున్నా దానిని ‘మలబద్దకం’గా పరిగణించాలి. ఈ విధంగా ఉన్నప్పుడు, మలవిసర్జన ప్రక్రియ కష్టతరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మలవిసర్జన చేసినప్పుడు, ఎక్కువ ముక్కినప్పుడు, అన్నవాహిక చివరి భాగంలో, మలద్వారానికి పైన పురీషనాళం చివర వాచిపోయిన రక్తనాళాలను ‘మొలలు’ (హెమరాయిడ్స్) అంటారు. ముఖ్యంగా గర్భం ధరించిన సమయంలో మొలలు తొలిసారిగా కన్పించవచ్చు.
 
 వ్యాధి లక్షణాలు:

 మలద్వారం చుట్టూ దురద  
 మలవిసర్జన సమయంలో నొప్పి  
 మలద్వారం చుట్టూ వాచిపోవడం, ఉబ్బుగా కనిపించడం  
 మల విసర్జన సమయం లో లేదా మల విసర్జన అనంతరం రక్తస్రావం  
 మలాశయం నుంచి పూర్తిగా మలవిసర్జన జరగలేదేమోనన్న భావన కలగడం.
 
 పాజిటివ్ హోమియోపతి మందులు మలబద్దకాన్ని చాలావరకు నివారిస్తాయి. మందులతో పాటు ఆహారపు అలవాట్లను కూడా పూర్తిగా అనుసరిస్తే, మలబద్దకం, దాని నుంచి వచ్చే తీవ్రతలను పూర్తి స్థాయిలో అరికట్టవచ్చు.
 
 PCOD
 ఈ సమస్య యుక్తవయస్సులో ఉండే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. PCOD అనగా అండాశయాలలో నీటి బుడగలు ఏర్పడి అవి ఈస్ట్ లాగా డెవలప్ అవుతాయి. దీనివల్ల నెలసరి రాకపోవడం, అండం విడుదల జరుగకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య ఎక్కువగా 20-30 సం. వయస్సుగల వారిలో కనిపిస్తుంది.
 
 వ్యాధి లక్షణాలు:
 నెలసరి రాకపోవడం  
 బరువు పెరగడం
 సంతానం కలగకపోవడం  
 అవాంఛిత రోమాలు  
 ఆమినోరియా  
 జుట్టు రాలడం  
 చర్మం మందంగా మారడం
 
 కారణాలు: ఇది ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత వలన మానసిక ఒత్తిడి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది.
 
 ఆడవారిలో ముఖ్యంగా నెలసరి, అండం విడుదల జరగాలంటే FSH, LH హార్లోన్లు ముఖ్యపాత్ర వహిస్తాయి. FSH హార్మోన్ కన్నా LH హార్లోన్ ఎక్కువగా ఉన్నప్పుడు నీటిబుడగలు ఏర్పడి అవి కణితిలా మారి అండం విడుదల కాదు. నెలసరి అసలు రాకపోవచ్చు. మానసిక ఒత్తిడి అంటే ఎక్కువగా ఆలోచించి ఎక్కువ బాధపడడం వంటి కారణాలు మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. అప్పుడు PCOD ఉన్నవారిలో తొందరగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
 
 టాన్సిల్స్
 మన చుట్టూ ఉన్న వాతావరణంలో సహజంగా ఉండే వ్యాధికారక సూక్ష్మక్రిములు శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినా, మనం తీసుకునే నీటిద్వారా కాని, ఆహారం ద్వారా కాని ఇవి లోపల చేరి ఇన్ఫెక్షన్స్‌ని కలుగచేసి కొన్నిరకాల విషపదార్థాలతో చీముని కలుగుజేస్తాయి. అందువల్ల టాన్సిల్స్ వ్యాధి వస్తుంది. టాన్సిల్స్ అనేవి గొంతులో నాలుక వెనుక భాగానికి సమీపంగా రెండువైపులా ఉండే చిన్న బంతుల వంటి నిర్మాణాలు. ఆరోగ్యవంతమైన టాన్సిల్స్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి.
 
 వ్యాధి లక్షణాలు:  
 గొంతునొప్పి  
 దగ్గు  
 ఆహారం మింగినప్పుడు గొంతులో నొప్పి లేక కష్టంగా ఉండడం
 మెడ భాగంలో బిళ్ళలు కట్టడం  
 తరచూ జ్వరం రావడం  
 తోటిపిల్లలతో పోలిస్తే నీరసంగా కనిపించడం
 పెరుగుదల లోపించుట.
 
 టాన్సిల్స్ వ్యాధి ఉన్నప్పుడు సరైన వైద్యం చేయకుండా చాలాకాలం నిర్లక్ష్యం చేసినట్లయితే టాన్సిల్స్ లోపల, చుట్టుపక్కల, గొంతులోని ఇతరభాగాలకు చీము చేరుతుంది. మధ్యచెవికి, ముక్కు దగ్గర ఉండే గాలి గదుల్లోకి చేరితే సైనసైటిస్, ఊపిరితిత్తుల్లోకి చేరితే శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి.
 
 సైనసైటిస్
 సైనస్‌లో ఇన్ఫెక్షన్ చేరి అక్కడ కఫం, చీము తయారై నిలువ ఉన్నప్పుడు దానిని సైనసైటిస్ అంటారు. ఇది నాసల్ ఎలర్జీ, పాలిప్స్ వంటి వాటివల్ల అధికంగా మ్యూకస్ స్రవించడం వల్ల లేదా రంధ్రం మూసుకుపోవడం వల్ల, లేదా పిప్పిపన్ను ఇన్ఫెక్షన్, సైనస్‌లోకి చేరినా వస్తుంది. టాన్సిల్స్ వ్యాధి, ఎడినాయిడ్స్ వ్యాధి, ముక్కులోపల ఉండే గోడ పక్కకు వంగిన సైనసైటిస్ వస్తుంది.
 
 వ్యాధి లక్షణాలు
 తరచుగా జలుబు ఉండడం  
 ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం కష్టంగా ఉండడం  
 ముక్కు, గొంతులోకి కఫం, చీముతో కూడిన కఫం రావడం
 కొందరికి చెడువాసన వస్తుంది  
 తలనొప్పి నుదుట భాగంలో, కళ్లకింద, కనుబొమ్మల మధ్య, తలకు ఇరుపక్కల, తల వెనుక భాగంలో వస్తుంది.
 
 సైనస్ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ సైనస్ నుండి ఇతర భాగాలకు వ్యాపించి, గొంతు, శ్వాసనాళాలకు వచ్చి, ఫారింజైటిన్, టాన్సిలైటిన్, బ్రాంకైటిస్ మొదలైన వ్యాధులు రావచ్చు.
 
 ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించిన ఎడల ఎటువంటి ఆపరేషన్  లేకుండా పాజిటివ్ హోమియోపతి మందుల ద్వారా చాలా వరకు నివారించే అవకాశం ఉంది.
 
 పొట్ట ఉబ్బరం, తేన్పులు, ఎసిడిటీ, అరుగుదల లేకపోవడం, ఉదర భాగం కుడివైపు నొప్పి పొట్ట ఉబ్బరంగా ఉండడం ముఖ్యంగా కొవ్వు పదార్థాలు ఆహారంలో తీసుకున్నప్పుడు ఇది పిత్తాశయంలో రాళ్ళ వల్ల అని భావించవచ్చు. గాల్‌స్టోన్‌కు చికిత్స తీసుకోని యెడల అది చాలా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. పాజిటివ్ హోమియోపతి మందులు వాడుట వలన వేగవంతమైన, మంచి ఫలితాలు సాధించవచ్చును.
 
 వ్యాధి లక్షణాలు:  
 కొంతమందిలో గాల్‌స్టోన్ వలన వికారంగా అనిపించడం, కుడి ఉదర భాగంలో తీవ్రంగా నొప్పి అన్పించడం వంటి లక్షణాలు కన్పించడం జరుగుతుంది
 
 ఇటువంటి లక్షణాలు స్టోన్స్ పిత్తాశయం నుంచి జారి పేగులకు కలిసే మార్గంలో అడ్డుపడినప్పుడు కన్పిస్తాయి  
 
 నొప్పి ఆకస్మికంగా మొదలై 3గంటల వరకు ఉండవచ్చును. నొప్పితో పాటు జ్వరం, అరుగుదల లేకపోవడం, చర్మం, కన్ను యొక్క తెలుపుభాగం పసుపురంగులో మారడం జరుగుతుంది. డయాబెటిస్, అతిబరువు, తక్కువ కెలోరీల ఆహారం, రక్తంలో కొలస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండడం. ప్రెగ్నెన్సీ, గర్భనిరోధక మాత్రలు, ఓల్డేజ్... కొద్దిమందిలో వంశపారంపర్యంగా కూడా రావచ్చును.
 
 పాజిటివ్ హోమియోపతి వైద్యవిధానంలో ఇటువంటి వ్యాధులు ముఖ్యంగా ముక్కులో కండరం పెరగటం, సైనస్, ముక్కులో కాయలు రావడం వంటి ఇతర కాంప్లికేషన్స్‌కు దారి తీయకుండా చూస్తాయి. వ్యక్తి శరీర తత్వాన్ని బట్టి వ్యాధులు మారుతూ వస్తాయి. ఈ తత్వాన్ని బట్టి మందులు తీసుకుంటే, ఎటువంటి ఆపరేషన్ అవసరం లేకుండా వ్యాధిని సమూలంగా నయం చేయవచ్చు.
 
 డా॥టి. కిరణ్‌కుమార్
 పాజిటివ్ హోమియోపతి
 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,
 వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై
 అపాయింట్‌మెంట్ కొరకు 9246199922

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement