పైల్స్ తగ్గాలంటే...
గృహవైద్యం
పైల్స్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. మలవిసర్జనలో రక్తం పడడానికి మలబద్ధకం కూడా ఒక కారణమే. పైల్స్ సమస్య అనేక అనుబంధ సమస్యలకు కూడా దారితీయవచ్చు. తొలిదశలో ఉన్న వారికి తక్షణ ఉపశమనం కోసం...
కాకర కాయ ఆకులను నలిపి రసం తీయాలి. మూడు టీ స్పూన్ల రసాన్ని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి ఉదయం పరగడుపున తాగాలి. ఇలా నెలరోజులు చేస్తే సమస్య పరిష్కారమవుతుంది.
పండిన అరటిపండు ఒక కప్పు పాలలో వేసి ఉడికించాలి. చల్లారిన తర్వాత మెదిపి ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇలా రోజుకు మూడు -నాలుగుసార్లు చేయాలి.
మూడు అంజూర్‌పండ్లను గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేవగానే వీటినే తొలి ఆహారంగా తినాలి. అలాగే పగలు కూడా నానబెట్టి... ఆ పండ్లను రాత్రి పడుకోవడానికి ముందు తినాలి.