This is Why You Should Not Spend More Than 10 Minutes on the Toilet: చాలా మందికి టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడపటం అలవాటు. టాయిలెట్‌లో తీరిగ్గా కూర్చుని ఫోన్ చూస్తూ గంటల కొద్ది సమయం ఈజీగా గడిపేస్తారు. ఐతే ఆ పొజిషన్‌లో ఎక్కువ సమయం కూర్చోవరటం ఎంత ప్రమాదమో తెలిస్తే 10 నిముషాలకంటే ఎక్కువ సమయం టాయిలెట్‌లో ఎప్పటికీ గడపరు. అవునండీ.. తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
యూనివర్శిటీ ఆఫ్ సుందర్‌ల్యాండ్‌కి చెందిన క్లినికల్ లెక్చరర్ ఎన్‌హెచ్‌ఎన్ సర్జన్ డా. కరన్ రాజన్ మాటల్లో.. ‘టాయిలెట్‌లో 10 నిముషాల కంటే ఎక్కువ సమయం కూర్చుంటే మల మార్గంలో ఉండే రక్తనాళాలపై ఒత్తిడి ఎక్కువయ్యి, రక్తనాళాలు ఉబ్బి ఫైల్స్ ఏర్పడతాయి. ఈ వ్యాధిని హెమోరాయిడ్ అని అంటారు. వీటిని తొలగించాలంటే శస్త్ర చికిత్స ఒక్కటే మార్గం. జీర్ణ ప్రక్రియ సజావుగా జరగడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారం ప్రతి రోజూ తీసుకుంటే మల విసర్జన సక్రమంగా ఉంటుంది' అని వివరించారు.
చదవండి: 2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్..
మీ జీవితంలో ఫైల్స్ సమస్య ఎప్పటికీ తలెత్తకుండా ఉండాలంటే ఈ సూచనలు ఖచ్చితంగా పాటించడం ఒక్కటే మార్గం. కాబట్టి టాయిలెట్‌లో సిట్టింగ్ పొజిషన్‌లో 10 నిముషాల కంటే ఎక్కువ సమయం గడపకండే!! జాగ్రత్త మరి..!
చదవండి: 23 కోట్ల బీమా సొమ్ము కోసం రైలు పట్టాలపై పడుకుని రెండు కాళ్లు..!!
Comments
Please login to add a commentAdd a comment