![Changes During Or After Pregnancy And Symptoms](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/preg2.jpg.webp?itok=cl5D9Zvr)
నేను ఇప్పుడు ఐదునెలల గర్భవతిని. రొమ్ముల్లో చాలా నొప్పి ఉంటోంది. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక రొమ్ముల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఏవి నార్మల్ అనేది తెలియజేయండి?
– బిందు, విజయవాడ.
బ్రెస్ట్ టిష్యూలో కొవ్వు ఉంటుంది. లోబ్యూల్స్ అంటే పాలను ఉత్పత్తి చేసేవి. డక్ట్స్ అంటే పాలను క్యారీ చేసేవి ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఈ లోబ్యూల్స్, డక్ట్స్ పాలను ఉత్పత్తి చేయటానికి సిద్ధమవుతుంటాయి. అందుకే, ప్రెగ్నెన్సీలో కొన్ని మార్పులు రెండు రొమ్ముల్లోనూ ఉంటాయి. సాధారణ మార్పులు అంటే రెండు రొమ్ముల ఆకారం, పరిమాణం మారుతాయి. నిపుల్స్, ఆరియోలా డార్క్‌గా మారుతాయి. వాటి చుట్టూ ఉన్న చర్మం కూడా డార్క్ అవుతుంది. కనిపించే రొమ్ము సిరల మీద స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. రొమ్ములు సున్నితంగా అవుతాయి. బ్రెస్ట్ అవేర్‌నేస్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. త్వరగా కేన్సర్‌ని డిటెక్ట్ చేయవచ్చు. ప్రతి మూడు వందల్లో ఒకరికి ప్రెగ్నెన్సీలో కూడా కేన్సర్ రావచ్చు. అందుకే బ్రెస్ట్ మీద చర్మం ముడతలు పడటం, నిపుల్ నుంచి గ్రీన్ కలర్ డిశ్చార్జ్ వచ్చినా, గడ్డలు తగిలినా అల్ట్రాసౌండ్ టెస్ట్స్ ప్రెగ్నెన్సీలో చేస్తాం.
ఏ సందేహం ఉన్నా బయాప్సీకి పంపిస్తాం. బ్రెస్ట్ ఫీడింగ్‌లో రొమ్ము కేన్సర్ ప్రమాదం చాలా తగ్గుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ డెలివరీ అయిన అరగంటలోపు చేయాలని అందుకే ఎంకరేజ్ చేస్తాం. ఎంత ఎక్కువ కాలం బ్రెస్ట్ ఫీడ్ ఇస్తే అంత మంచిది. కేన్సర్ రిస్క్ అంత తక్కువ చేస్తుంది. ఫీడింగ్ ఇచ్చే సమయంలో బ్రెస్ట్ గట్టిగా అవటం, ఫ్యూయర్ రావటం, నొప్పి ఉండటం చూస్తాం.
దీనిని ఎంగేజ్‌మెంట్ అంటాం, పాల డక్ట్స్ బ్లాక్ అయినందున ఇలా అవుతుంది. ప్రెగ్నెంట్ బ్రెస్ట్ ఫీడింగ్, ఎక్స్‌ట్రా మిల్క్‌ను తొలగించటంలాంటి వాటితో ఎంగేజ్‌మెంట్‌ను ప్రివెంట్ చేయవచ్చు. బ్రెస్ట్ స్పెషలిస్ట్‌ని సంప్రదించటం మంచిది. ప్రసవం అయి, బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కూడా రొమ్ముల్లో మార్పులు ఉంటాయి. ఈ మార్పులు చాలా వరకు ఫీడింగ్ ఆపిన తరువాత నార్మల్ బ్రెస్ట్‌లాగా అవుతాయి.
రొటీన్ చెకప్స్ చాలా అవసరం. ప్రతి నెలా ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ స్కిన్ టెక్స్‌చర్ మారుతుందా, ఆర్మ్‌పిట్‌లో ఏవైనా లంబ్స్ వచ్చాయా, నిపుల్ డిశ్చార్జ్‌లోను అకస్మాత్తుగా ఆకార పరిమాణాల్లోను మార్పులు వచ్చినా, నిపుల్ ఇన్వెన్షన్, డిసెక్షన్స్‌లో మార్పులు అయినా, దురద ఉన్నా వెంటనే డాక్టర్‌ని కలవాలి.
డాక్టర్ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్ హైదరాబాద్
(చదవండి: ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి?)
Comments
Please login to add a commentAdd a comment