
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సికార్‌లో మంగళవారం మధ్యాహ్నం బస్సు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సలాసర్ నుంచి వెళ్తున్న బస్సు సికర్ జిల్లాలోని లక్ష్మణ్‌గఢ్ వద్దకు రాగానే ఎదురుగా కల్వర్టును ఢీకొట్టింది.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లక్ష్మణ్‌గఢ్‌లోని ప్రభుత్వ సంక్షేమ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు నిర్ధారించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేంద్ర ఖిచాడ్ తెలిపారు.
#Sikar: #लक्ष्मणगढ़ पुलिया के पास भीषण हादसा
मृतकों की संख्या पहुंची12, एक और घायल ने तोड़ा दम, 35 से अधिक लोग हुए थे घायल, सीकर अस्पताल में पांच मृतकों के शव, सात शव रखे है लक्ष्मणगढ़ अस्पताल की मोर्चरी में, घायलों का जारी है इलाज, सुजानगढ़ से नवलगढ़ आ रही थी बस #RajasthanNews pic.twitter.com/LHZCnSpscb— Manoj Bisu Sikar (@manoj_bisu) October 29, 2024