Groom Bhukya Yakub Died Due To an Electric Shock At Mahabubabad District - Sakshi
Sakshi News home page

విధి ఆడిన వింత నాటకం.. పెళ్లింట పెను విషాదం

Published Thu, May 11 2023 7:08 PM | Last Updated on Thu, May 11 2023 7:33 PM

Groom Bhukya Yakub Died Due To Electric Shock At Mahabubabad District - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. రేపు పెళ్లిచేసుకోబోతున్న వరుడు.. విధి ఆడిన వింత నాటకంలో తనువు చాలించాడు. దీంతో, పెళ్ళిసందడితో ఉండాల్సిన ఇళ్ళు శోకసంద్రంగా మారింది. కరెంట్‌ షాక్‌ రూపంలో వరుడిని మృత్యువు వెంటాండింది. 

వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెంతండాకు చెందిన భూక్య బాలాజీ కాంతి దంపుతుల ఏకైక కుమారుడు భూక్య యాకుబ్‌. కాగా, యాకుబ్‌కు గార్ల మండలం పిక్లీతండాకు చెందిన అమ్మాయితో శుక్రవారం అర్ధరాత్రి వివాహం జరగాల్సి ఉంది. పెళ్ళి ఏర్పాట్లలో నిమగ్నమైన యాకుబ్, ఇంట్లో నీళ్ళ కోసం బోరు(మోటార్) ఆన్ చేసే క్రమంలో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు.

అయితే, మరికొద్ది గంటల్లో పెళ్ళి పీటలు ఎక్కాల్సిన వరుడు పాడెక్కడంతో పెళ్లింట విషాదం అలముకుంది. పెళ్ళికొడుకు మృతితో కన్నవారితోపాటు బంధుమిత్రులు బోరున విలపించారు. ఎదిగిన కొడుకు ఓ ఇంటివాడు అవుతున్న తరుణంలో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక, యాకుబ్ రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. 

ఇది కూడా చదవండి: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో రేణుకకు బెయిల్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement