
సాక్షి, నంద్యాల జిల్లా: బోయరేవులో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. పెళ్లయిన 24 గంటల్లో పెళ్లికుమారుడు దుర్మరణం చెందడం కలకలం రేపింది. బోయరేవుకు చెందిన శివకుమార్‌తో జూపాడు బంగ్లా మండలం భాస్కరపురానికి చెందిన మౌనిక అనే యువతితో పెద్దలు పెళ్లికి నిశ్చయించారు. పెద్దల సమక్షంలో నిన్న(శుక్రవారం) ఘనంగాపెళ్లి జరిగింది. సాయంత్రం బరాత్‌లో వధూవరులిద్దరూ సంతోషంగా నృత్యాలు కూడా చేశారు. అర్ధరాత్రి ఇంటి నుంచి రోడ్డు మీదకు వెళ్లిన వరుడు శివకుమార్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి.
చదవండి: పరిచయం.. కొన్నేళ్లుగా సహజీవనం.. అసలు ఏం జరిగిందో కానీ..
Comments
Please login to add a commentAdd a comment