మూడో టెస్టుకు భువీ దూరం
భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ వెన్నునొప్పి కారణంగా కివీస్‌తో జరిగే మూడో టెస్టుకు దూరమయ్యాడు. కోల్‌కతా టెస్టు సమయంలోనే తను ఇబ్బందిపడ్డాడని బీసీసీఐ తెలిపింది. భువనేశ్వర్ స్థానంలో ముంబై పేసర్ శార్దుల్ ఠాకూర్ జట్టుతో చేరాడు.
ఇండోర్‌లో శనివారం నుంచి జరిగే ఈ టెస్టులో తమ కెప్టెన్ విలియమ్సన్ అందుబాటులో ఉంటాడని న్యూజిలాండ్ జట్టు వెల్లడించింది.