మౌంట్ మాంగనీ: కివీస్ ఓపెనర్ మున్రో (23 బంతుల్లో 66; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు చినుకుల్లో కలిసిపోయాయి. వెస్టిండీస్‌తో సోమవారం జరిగిన రెండో టి20 మ్యాచ్ వర్షంతో రద్దయింది. వర్షంతో ఆలస్యంగానే ప్రారంభమైన ఈ మ్యాచ్ ఎంతో సేపు సాగలేదు. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఆట నిలిచే సమయానికి 9 ఓవర్లలో 4 వికెట్లకు 102 పరుగులు చేసింది. మున్రో 18 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. కాట్రెల్, బద్రీ, నర్స్, విలియమ్స్ తలా ఒక వికెట్ తీశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1–0తో ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment