నెల్సన్: న్యూజిలాండ్, పాకిస్తాన్ వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్‌నూ వర్షం విడిచి పెట్టలేదు. దీంతో ఈ మ్యాచ్ ఫలితాన్నీ డక్‌వర్త్ లూయిస్ (డీఎల్) పద్ధతే తేల్చింది. మంగళవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య కివీస్ జట్టు డీఎల్ పద్ధతిలో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. మొదట పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 246 పరుగులు చేసింది. మహమ్మద్ హఫీజ్ (60; 8 ఫోర్లు), షాదాబ్ ఖాన్ (52; 3 ఫోర్లు, 1 సిక్స్), హసన్ అలీ (51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు.
తర్వాత వర్షం వల్ల లక్ష్యాన్ని 25 ఓవర్లలో 151 పరుగులుగా నిర్దేశించారు. దీన్ని న్యూజిలాండ్ 23.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గప్టిల్ (71 బంతుల్లో 86 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రాస్ టేలర్ (43 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం కివీస్ 2–0తో ఆధిక్యంలో ఉంది. మూడో వన్డే శనివారం డ్యునెడిన్‌లో జరుగుతుంది.
రెండో వన్డేలోనూ కివీస్‌దే విజయం
Published Wed, Jan 10 2018 1:17 AM | Last Updated on Wed, Jan 10 2018 1:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment