PAK VS NZ 2nd ODI: Conway Century Helps Spin-Heavy New Zealand Stun Pakistan, Know Score Details - Sakshi
Sakshi News home page

PAK VS NZ 2nd ODI: కాన్వే సూపర్‌ సెంచరీ.. పాక్‌ను మట్టికరిపించిన న్యూజిలాండ్‌

Published Thu, Jan 12 2023 9:46 AM | Last Updated on Thu, Jan 12 2023 11:21 AM

PAK VS NZ 2nd ODI: Conway Hundred Helps New Zealand Stun Pakistan - Sakshi

కరాచీ: పాకిస్తాన్‌తో బుధవారం (జనవరి 11) జరిగిన రెండో వన్డేలో పర్యాటక న్యూజిలాండ్‌ 79 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 49.5 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే సూపర్‌ సెంచరీతో (92 బంతుల్లో 101; 13 ఫోర్లు, సిక్స్‌) అదరగొట్టగా.. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (100 బంతుల్లో 85; 10 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. పాక్‌ బౌలర్లలో నవాజ్‌ (4/38), నసీమ్‌ షా (3/58) ఆకట్టుకున్నారు.

అనంతరం 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 43 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (114 బంతుల్లో 79; 8 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బాబర్‌ మినహా పాక్‌ జట్టంతా విఫలమైంది. మహ్మద్‌ రిజ్వాన్‌ (28), అఘా సల్మాన్‌ (25) ఓ మోస్తరుగా రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో సౌథీ, సోధీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్‌, సాంట్నర్‌, బ్రేస్‌వెల్‌, ఫిలిప్స్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పాక్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడో వన్డే శుక్రవారం (జనవరి 13) జరుగుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement